Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య న్యూ చండీగఢ్‌లో జరుగుతున్న హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో ఒక ఆందోళనకర సంఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. కేవలం 19 బంతుల్లోనే 34 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న జడేజా, ఎనిమిదో ఓవర్ ముగిసిన తర్వాత ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. రవీంద్ర జడేజా మోచేతి గాయం కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో జడేజా మోచేతికి భారీగా బ్యాండేజ్ (టేప్) వేసి ఉండటం కనిపించింది. ఫిజియోల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న అనంతరం, జట్టుకు అవసరమైన సమయంలో జడేజా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పుడు, 13వ ఓవర్లో ఆయన మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు అండగా నిలిచాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
టాస్ రీ-స్పిన్: ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, పరాగ్ టాస్ పిలుపు (Call) మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్‌కు స్పష్టంగా వినబడకపోవడంతో టాస్‌ను మరోసారి వేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఆర్ఆర్ ఇక్కడికి రాగా, క్వాలిఫైయర్-1లో ఆర్సిబి చేతిలో ఓడిపోయిన గుజరాత్ ఈ మ్యాచ్ ద్వారా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!