Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
- హానర్ విన్ టర్బో రిలీజ్
- 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్
- 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్‌తో విడుదలైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor తన కొత్త Honor Win Turbo స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. హానర్ విన్ సిరీస్‌లో వచ్చిన ఈ కొత్త ఫోన్ భారీ 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి వచ్చింది. అలాగే 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్‌తో విడుదలైంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో లభిస్తుంది.
హానర్ విన్ టర్బో ధర
Also Read
- NASA Swift Telescope: నాసా రెస్క్యూ విఫలం.. భూమిపై కూలిపోనున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ.!
- IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
- Xiaomi TV A Pro e Series: షియోమి నుంచి 85 అంగుళాల 4K QLED టీవీలు.. 120Hz రిఫ్రెష్ రేట్, Google TVతో కొత్త సిరీస్ లాంచ్!
- Nvidia: చైనాకు AI చిప్స్ అక్రమ రవాణా.? ఎన్విడియా సీఈఓ సన్నిహితురాలిపై అనుమానం..
Honor Win Turbo మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
12GB + 256GB వేరియంట్ ధర: CNY 3,299 (సుమారు రూ.46,000)
12GB + 512GB వేరియంట్ ధర: CNY 3,599 (సుమారు రూ.50,000)
16GB + 512GB వేరియంట్ ధర: CNY 4,199 (సుమారు రూ.60,000)
డిస్ప్లే ఫీచర్లు
Honor Win Turboలో 6.79 అంగుళాల 1.5K AMOLED Oasis Eye Protection డిస్ప్లేను అందించారు.
ఈ డిస్ప్లే:
120Hz రిఫ్రెష్ రేట్
3840Hz PWM డిమ్మింగ్
94.62% స్క్రీన్-టు-బాడీ రేషియో
8000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఫీచర్లతో వస్తుంది.
ప్రాసెసర్, పనితీరు
ఈ ఫోన్లో MediaTek Dimensity 8500 Racing Edition చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Mali-G720 MC8 GPU అందించారు. 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. నెట్వర్క్ బలహీనంగా ఉండే ప్రాంతాల్లో కూడా మెరుగైన కనెక్టివిటీ కోసం C1+ RF ఎన్హాన్స్మెంట్ చిప్‌ను కూడా జోడించారు.
కెమెరా సెటప్
Honor Win Turboలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందించారు. గేమింగ్, హెవీ యూజ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 40,000 చదరపు మిల్లీమీటర్ల లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు.
కనెక్టివిటీ, సేఫ్టీ ఫీచర్లు
ఈ ఫోన్లో 5G, Bluetooth 6.0, NFC, USB Type-C, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
అలాగే, ఈ ఫోన్‌కు: IP66, IP68, IP69, IP69K దుమ్ము, నీటి నిరోధక రేటింగ్స్ లభించాయి. Honor Win Turboలో ప్రధాన ఆకర్షణ 10,000mAh భారీ బ్యాటరీ. 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17.3 గంటల వరకు నావిగేషన్, 14.2 గంటల వరకు గేమింగ్ సపోర్ట్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ బరువు సుమారు 216 గ్రాములు కాగా, మందం 7.98mmగా ఉంది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..