Rajasthan: విషాదం.. భర్త మృతితో షాక్‌కు గురై..భార్య, కొడుకు కూడా మృతి
- రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో ఓ విషాద ఘటన
- భర్త మృతితో షాక్‌కు గురైన భార్య..కుమారుడు కూడా మృతి
- శనివారం మృతి చెందిన భర్త..24గంటల వ్యవధిలోనే భార్య..కుమారుడి మరణం
- గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మృతితో షాక్‌కు గురైన భార్య, కుమారుడు కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ముగ్గురి పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాతే మొత్తం పరిస్థితి తేలనుందని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
READ MORE: Godavari Floods: గోదావరికి శబరిపోటు.. ప్రమాద హెచ్చరికలు జారీ
Also Read
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
అసలేం జరిగిందంటే.. షాహపురా జిల్లాలోని కోత్రి సబ్‌డివిజన్‌లోని బద్లియాస్ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ సోని శనివారం ఉదయం పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే.. భర్త మరణం తర్వాత షాక్ కు గురైన భార్య మమత, కుమారుడు అశుతోష్ ఆదివారం అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే వారిద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ.. తల్లి, కొడుకు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన వార్త ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆదివారం మధ్యాహ్నం తల్లీకొడుకుల అంత్యక్రియలు జరగడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.
READ MORE: India-Pak: సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య..ఫెన్సింగ్ కట్ చేసిన పాక్ పౌరులు
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యన్‌నారాయణ సోనిని గత కొన్ని రోజులుగా వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ కుటుంబంలో ముగ్గురు మృతికి గల కారణాలేమిటన్నది పోలీసుల విచారణలో తేలనుంది. బద్లియాస్ పోలీస్ స్టేషన్ మొత్తం కేసును సీరియస్‌గా విచారించడం ప్రారంభించింది. ముగ్గురి పోస్టుమార్టం నివేదిక తర్వాతే మొత్తం పరిస్థితి తేలనుందని బద్లియాస్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సిద్ధార్థ్ ప్రజాపత్ తెలిపారు.
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..