కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ రీసెంట్ గా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన జైలర్ మూవీ లో అతిధి పాత్రలో నటించి మెప్పించాడు.. శివరాజ్ కుమార్ పాత్ర జైలర్ సినిమా కు హైలైట్ గా నిలిచింది. అలాగే శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది..దసరా సమయంలో తెలుగులో తీవ్రమైన పోటీ ఉండటంతో తెలుగు వెర్షన్‍లో ఘోస్ట్ మూవీ నవంబర్ 4న థియేటర్లలో కి వచ్చింది. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం.. తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కాగా, తాజాగా ఘోస్ట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్అయింది…ఘోస్ట్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 17వ తేదీన ఘోస్ట్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు జీ5 అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది.యాక్షన్ థ్రిల్లర్ గా ఘోస్ట్ మూవీ తెరకెక్కింది.. ఈ సినిమాకు ఎంజీ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జయరామ్, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, అర్చనా జోయిస్, సత్యప్రకాశ్, అభిజిత్ మరియు విజయలక్ష్మి సంగ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో హీరో శివరాజ్ కుమార్ రెండు పాత్రలలో నటించారు.. బిగ్‍డాడీ ముద్దన్న అనే గ్యాంగ్‍స్టర్ పాత్రలో ఆయన యాక్షన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఓ జైలును గ్యాంగ్‍స్టర్ బిగ్‍డాడీ ముద్దన్న (శివరాజ్ కుమార్) హైజాక్ చేయడం అలాగే దొంగతనం చుట్టూ ఘోస్ట్ మూవీ సాగుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది.ఘోస్ట్ చిత్రాన్ని సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సందేశ్ నాగరాజ్ నిర్మించారు. అరుణ్ జన్య ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.