Sheetal Devi: ఆసియా పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత, భారత పారా ఆర్చర్ శీతల్ దేవి శనివారం (సెప్టెంబర్ 27న) కొరియాలోని గ్వాంగ్జులో జరిగిన పారా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మరో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఉత్కంఠగా సాగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో టర్కీ స్టార్ క్రీడాకారిణి ఓజ్నూర్ క్యూర్ గిర్డిపై 146-143 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో శీతల్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. ఇంతకుముందు ఆమె టోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి కాంస్య పతకం గెలిచింది. కాంపౌండ్ మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్‌లో శీతల్, సరిత ద్వయం టర్కీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది.
50MP క్వాడ్ కెమెరా లెన్స్, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లే, కూలింగ్ సిస్టమ్‌తో వచ్చేసిన Xiaomi 17
వ్యక్తిగత ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి రౌండ్‌లో ఇద్దరు క్రీడాకారిణులు 29-29తో సమంగా నిలిచారు. రెండో రౌండ్‌లో శీతల్ మూడు పర్ఫెక్ట్ 10లతో 30-27తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో రౌండ్ మళ్లీ 29-29తో టై అయింది. నాలుగో రౌండ్‌లో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓడినా 116-114తో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. చివరి రౌండ్‌లో శీతల్ మూడు బాణాలను సంధించి 30 పాయింట్లతో పర్ఫెక్ట్‌గా షూట్ చేసి పసిడిని గెలుచుకుంది. అంతకుముందు సెమీఫైనల్‌లో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ ఆర్చర్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోడీ గ్రిన్హామ్‌పై 145-140తో విజయం సాధించింది. గతంలో, 2023 పిల్‌సెన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇదే గిర్డి చేతిలో శీతల్ 140-138తో ఓడిపోయింది. కానీ ఈసారి ఆమె విజయం సాధించి గత ఓటమికి బదులు తీర్చుకుంది.
కాంపౌండ్ మహిళల ఓపెన్ టీమ్ ఫైనల్‌లో శీతల్, సరిత ద్వయం ప్రారంభంలో మెరుగ్గానే రాణించారు. కానీ, టర్కీ టీమ్ చేతిలో 148-152 తేడాతో ఓడిపోయారు. మొదటి రౌండ్లో భారత ద్వయం 38-37తో ఆధిక్యంలోకి వచ్చింది. కానీ టర్కీ జట్టు రెండో రౌండ్‌లో పుంజుకుని స్కోరును 76-76తో సమం చేసింది. మూడో రౌండ్‌లో భారత జట్టు ఒత్తిడికి గురై 36 పాయింట్లు మాత్రమే సాధించగా, టర్కీ 37 పాయింట్లను సాధించింది. చివరి రౌండ్‌లో టర్కీ జట్టు దాదాపు పర్ఫెక్ట్‌గా 39 పాయింట్లు సాధించి స్వర్ణం గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఓడిపోయినప్పటికీ, శీతల్ దేవి వ్యక్తిగత ప్రదర్శనతో భారతదేశపు ఉత్తమ పారా ఆర్చర్లలో ఒకరని రుజువు చేసింది.
THE HISTORICAL MOMENTS FOLKS! 🔥🤩
India's First Ever Individual Para Archery World Champion – Sheetal Devi 🇮🇳🏆pic.twitter.com/5G58Wr4mGj
— The Khel India (@TheKhelIndia) September 27, 2025