50MP క్వాడ్ కెమెరా లెన్స్, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లే, కూలింగ్ సిస్టమ్‌తో వచ్చేసిన Xiaomi 17
- Xiaomi 17 వచ్చేసింది
- 50MP క్వాడ్ కెమెరాలు, 7000mAh బ్యాటరీ, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్
- 100W వైర్డ్ + 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్, OLED డిస్‌ప్లే, కూలింగ్ సిస్టమ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi 17: షియోమీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 17 (Xiaomi 17)ని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అత్యుత్తమ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. ఇందులో 6.3 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ M10 LTPO ప్యానెల్ ఉంది. ఇది 1-120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే ముఖ్యమైన ఫీచర్ 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఇది కొత్త “రెడ్ లైట్ ఎమిటింగ్ మెటీరియల్”తో తయారు చేయబడింది. డిస్‌ప్లేకు షియోమీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ రక్షణగా ఉంది.
India vs Pakistan: అమ్మో, భారత్‌తో మ్యాచ్ అంటేనే భయమేస్తుంది.. పాక్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
Also Read
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
- OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
ఇక ఫోన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇది సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనితోపాటు గరిష్టంగా 16GB LPDDR5X RAM, అలాగే ఇందులో రింగ్ ఆకారపు కూలింగ్ సిస్టమ్ ఉంటాయి. దీనివల్ల గేమింగ్ ఆడేటప్పుడు కూడా ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది. కెమెరా పరంగా, ఇందులో లీకా సుమ్మిలక్స్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, మరియు 50MP 2.6X టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కెమెరాను కూడా 50MPకి అప్‌గ్రేడ్ చేశారు. ఈ ఫోన్‌లో ఉన్న 7000mAh బ్యాటరీ మరో ప్రధాన ఆకర్షణ. ఇది 100W షియోమీ సర్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50W షియోమీ సర్జ్ వైర్‌లెస్ ఛార్జింగ్, 22.5W వైర్డ్, వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
షియోమీ 17 ధర విషయానికి వస్తే.. 12GB + 256GB మోడల్‌ను 4499 యువాన్ (రూ.55,880), 12GB + 512GB మోడల్‌ను 4799 యువాన్ (రూ.59,700), 16GB + 512GB మోడల్ 4999 యువాన్ (సుమారు రూ.62,185). ఈ ఫోన్ చైనాలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!