Realme GT 8 Pro: రియల్‌మీ (realme) త్వరలో విడుదల చేయనున్న రియల్‌మీ GT 8 ప్రో (Realme GT 8 Pro) స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మరిన్ని అధునాతన ఫీచర్లతో రాబోతోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 2K 144Hz స్కై స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. దీనిని BOE సంస్థ తయారు చేసింది. ఇందులో వాడిన కస్టమ్ Q10+ ల్యూమినస్ మెటీరియల్ వల్ల పీక్ బ్రైట్‌నెస్ 7000 నిట్స్ వరకు ఉంటుంది. ఇది GT 7 ప్రో కన్నా ఎక్కువ. అలాగే ఇది 1 నిట్ వరకు తక్కువ బ్రైట్‌నెస్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఫ్లాట్ స్క్రీన్‌తో పాటు గ్లోబల్ ఫుల్ బ్రైట్‌నెస్ DC డిమ్మింగ్, సర్క్యులర్ పోలరైజేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
The Raja Saab : దసరా పండుగకు గ్రాండ్ ట్రీట్ రెడీ చేస్తున్న ‘రాజా సాబ్’.. ?
ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని 3C సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది. అయితే, ఈసారి 7000mAh కంటే పెద్ద బ్యాటరీని ఉపయోగించే అవకాశం ఉంది. GT 7 ప్రోలో లేని వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుందని సమాచారం. కెమెరా పరంగా ఈ ఫోన్‌లో కొత్త ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. రియల్‌మీ ఫోన్లలో మొదటిసారిగా ఇందులో 200MP టెలిఫోటో కెమెరాను ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు 50MP మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫ్లాట్ స్క్రీన్, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68 రేటింగ్, డ్యుయల్ 115E స్పీకర్లు, X-యాక్సిస్ లీనియర్ మోటార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రియల్‌మీ GT 8 సిరీస్ అక్టోబర్‌లో అధికారికంగా విడుదల కానుంది.
IND vs PAK: ఎవరి చేతికి ట్రోఫీ? ముచ్చటగా మూడోసారి.. ఫైనల్లో పాకిస్థాన్తో భారత్ఢీ..