Biker: స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం ‘బైకర్’. ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్. తెలుగులో తొలిసారి ఓ బైక్ రేస్ చిత్రం వస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాను డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తు్న్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
READ ALSO: Harish Rao : రూ.50,000 కోట్ల పవర్ స్కామ్ – హరీష్ రావు బాంబ్.!
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సినిమాకు సంబంధించిన వర్క్స్‌ను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దే పనుల్లో యూనిట్ బిజీగా ఉందని, ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించేందుకు తాము పని చేస్తున్నామని, అందుకే ఈ సినిమాకు మరింత సమయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాను 3D, 4DX లతో పాటు ఇతర ఫార్మాట్‌లలోనూ రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కారణంగా సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేయడం లేదని తాజాగా ప్రకటనలో వెల్లడించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఇందులో శర్వానంద్‌కు జోడిగా మాళవిక నాయర్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ అందిస్తున్నాడు.
READ ALSO: Rabri Devi Bungalow: బరాబర్ బంగ్లా ఖాళీ చేయం.. అల్టిమేటం జారీ చేసిన ఆర్జేడీ!
#Biker stands postponed!
A new release date will be announced soon.
A bigger, better experience is being crafted with care and being assembled with passion ❤️#Biker will be releasing in 3D, 4DX, and many more formats 💥 pic.twitter.com/H4ZoyqQxqg
— UV Creations (@UV_Creations) November 26, 2025