Tollywood Movies : ప్రతేడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్ సినిమాలకు నిజంగా పండుగ లాంటిదే. అందుకే ప్రతి హీరో తమ సినిమాలను సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలని భావిస్తుంటారు. నిర్మాతలకు కూడా సంక్రాంతి సెంటిమెంట్. భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు సంక్రాంతి టార్గెట్ గా బరిలోకి దిగుతాయి. మూడు నాలుగు పెద్ద సినిమాలు ఒకే వారంలో రిలీజ్ అయినా అన్ని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు వస్తుంటాయి. పైగా డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే, పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాత్రం తెలుగు సినిమాలకు ఘోరమైన అవమానం జరుగుతోంది. ఎక్కడైనా గోడ పై తెలుగు సినిమా పోస్టర్లు కనిపిస్తే చాలు ఆ పోస్టర్లను కన్నడిగులు చించేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే ఆ పోస్టర్ల పై నల్లరంగు పూసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Read Also:Ponguleti Srinivas Reddy: రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే మా లక్ష్యం..
అయితే తెలుగు సినిమా పోస్టర్లను కన్నడిగులు చించడానికి ముఖ్య కారణం… పోస్టర్లు తెలుగులో ఉండటమేనట. మా రాష్ట్రంలో తెలుగులో పోస్టర్లను అతికించడం ఏంటి అని వారు వీటిని చించివేస్తున్నట్లు సమాచారం. పైగా ఆ తెలుగు పోస్టర్లపై కన్నడ అని రాస్తున్నారు. మొత్తానికి కర్ణాటకలో కూడా భాషాభిమానం రోజురోజుకు పెరుగుతూ ఉండడం చెప్పుకోదగ్గ విషయమేనని తెలుస్తోంది. అన్నట్లు కర్ణాటకలో కూడా బాలయ్య, చరణ్ లకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం వారు నటించిన డాకుమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్ సినిమాలు పండుగకు వస్తున్నాయి. ఆ హీరోల సినిమాలకు అక్కడ భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే వారికి కూడా అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సంక్రాంతికి వస్తున్న ఈ ముగ్గురి సినిమాలు ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేస్తాయో చూడాలి.
Read Also: