Shakib Al Hasan: షకీబ్ అల్ హసన్‌కు ఐసీసీ షాక్.. ఇక బౌలింగ్ చేయకూడదు!
- షకీబ్ అల్ హసన్‌కు షాక్
- షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై వేటు
- బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు వరుస షాక్‌లు తగిలాయి. ముందుగా షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్ సహా దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి ఏ లీగ్‌లలో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధించింది. ఈమేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది. షకీబ్ అన్ని రకాల క్రికెట్‌లో బ్యాటర్‌గా మాత్రం కొనసాగవచ్చు.
‘మా ప్లేయర్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌ను నిషేధిస్తున్నట్లు ఐసీసీ మాకు సమాచారం ఇచ్చింది. ఈసీబీ విచారణ అనంతరం ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు విదేశాల్లోని ఏ లీగ్‌లలో కూడా షకీబ్ బౌలింగ్ చేయకూడదు. బౌలింగ్ యాక్షన్ కారణంగానే అతడికి ఈ పరిస్థితి ఎదురైంది’ అని బీసీబీ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరులో కౌంటీ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు రావడంతో ఈసీబీ పరీక్షించింది. షకీబ్ మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంపు తిరిగినట్లు తేలింది. దాంతో ఐసీసీ అతడిపై వేటు వేసింది.
Also Read
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్‌కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
Also Read: Israel-Hamas War: ఇజ్రాయెల్ దాడులు.. గాజాలో 69 మంది మృతి!
షకీబ్ అల్ హసన్ కొన్ని నెలల క్రితం టీ20 ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. షకీబ్ ఇప్పుడు కెరీర్ ముగింపులో ఉన్నాడు. ఇటీవల భారత్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా.. స్వదేశంలో చివరి టెస్టు ఆడాలనుందని షకీబ్ చెప్పాడు. అయితే బంగ్లాదేశ్‌లో అల్లర్ల కారణంగా మిర్పూర్‌లో దక్షిణాఫ్రికాతో ఫేర్‌వెల్ టెస్టు ఆడలేకపోయాడు. సరైన ఫామ్ లేని షకీబ్‌ను వన్డే స్క్వాడ్ నుంచి కూడా బీసీబీ మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. స్వదేశానికి వెళ్లలేని పరిస్థితులలో విదేశీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఇప్పుడు అతడి బౌలింగ్ యాక్షన్‌పై వేటు పడడంతో దాదాపుగా అతడి కెరీర్ క్లోజ్ అయినట్లే.
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్‌పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్‌రూమ్‌కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్‌సెట్‌పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!