Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రియల్ లైఫ్‌లో డార్లింగ్ పెళ్లి భాజా ఎప్పుడు మోగుతుందో తెలియదు కానీ.. రీల్ లైఫ్‌లో మాత్రం మన రెబల్ స్టార్ పెళ్లి పీటలెక్కేశాడు! అవును, ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక సెన్సేషనల్ న్యూస్ చక్కర్లు కొడుతున్నది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ తాజా షెడ్యూల్లోనే ఒక భారీ వెడ్డింగ్ సీక్వెన్స్‌ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్లో ప్రభాస్, టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమవుతున్న సోషల్ మీడియా సెన్సేషన్, బ్యూటీ ఇమాన్వీల వివాహ ఘట్టాన్ని అత్యంత ఘనంగా తెరకెక్కిస్తున్నారు. ఈ గ్రాండ్ మ్యారేజ్ సీక్వెన్స్ కోసమే నవంబర్ 7వ తేదీన ప్రభాస్ సెట్స్‌లో అడుగుపెట్టాడు.
ఒక భారీ సెట్లో, కళ్లు చెదిరే ఆర్ట్ వర్క్‌తో ఈ పెళ్లి తంతును హను రాఘవపూడి తనదైన పొయెటిక్ స్టైల్లో చిత్రీకరిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. స్వాతంత్ర్యానికి పూర్వం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమకథలో ప్రభాస్ మిలిటరీ కల్నల్ పాత్రలో కనిపిస్తున్నాడు. సాంప్రదాయ బద్ధంగా, పాతకాలం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా సాగే ఈ వెడ్డింగ్ సీక్వెన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ట్రీట్‌లా ఉండబోతోందట. అసలే లాంచింగ్ ఈవెంట్లో ప్రభాస్, ఇమాన్వీల పెయిర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ వర్కవుట్ అయితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా వీళ్లిద్దరి పెళ్లి సీన్‌ను షూట్ చేస్తున్నారన్న వార్త బయటికి రావడంతో.. ఆన్ స్క్రీన్ మీద డార్లింగ్ పెళ్లి కొడుకు గెటప్ ఎలా ఉండబోతోందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి రియల్ లైఫ్ మ్యారేజ్ సంగతి పక్కనపెడితే, ‘ఫౌజీ’ సెట్స్‌లో ప్రభాస్ పెళ్లి మాత్రం అదిరిపోనుందని ఈ లీకైన న్యూస్ స్పష్టం చేస్తోంది!
Also Read
- Renu Desai: మెగా ఈవెంట్స్‌కి అకీరా, ఆద్యల వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
- Ram Gopal Varma: "ఆ కుక్కలను పట్టించుకోవద్దు".. 'రామాయణం'పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
- Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
- Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
తాజావార్తలు
-
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
-
Renu Desai: మెగా ఈవెంట్స్‌కి అకీరా, ఆద్యల వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
ట్రెండింగ్
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!