Amala Akkineni : సముద్రంలో కొట్టుకుపోయిన అక్కినేని అమల.. ఎలా బతికిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్కినేని అమల, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ఉల్లడక్కం’. 1991లో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకి గాను మోహన్ లాల్‌కు ఉత్తమ నటుడిగా, కమల్‌కు ఉత్తమ దర్శకుడిగా కేరళ రాష్ట్ర అవార్డులు వరించాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఊహించని భయానక ఘటనను దర్శకుడు కమల్ తాజాగా ‘వనిత’ మ్యాగజైన్లో రాస్తున్న తన కాలమ్‌లో పంచుకున్నారు. స్టార్ హీరోయిన్ అమల సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాపాయ స్థితికి వెళ్లిన ఆ సంఘటన తలచుకుంటే ఇప్పటికీ తన ఒంట్లో వణుకు పుడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో అమల ‘రేష్మ’ అనే మానసిక రోగి పాత్రలో నటించింది. కథ ప్రకారం రేష్మ ప్రియుడు సముద్రంలో పడిపోయే ఒక కీలకమైన ఎమోషనల్ సీన్ తీయాల్సి ఉంది. దీనికోసం ఓ సముద్ర తీరాన్ని ఎంచుకున్నారు. ఆ రోజు సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంది. అలల ఉధృతి (హై టైడ్) ఎక్కువగా ఉండటంతో స్థానిక మత్స్యకారులు సినిమా బృందాన్ని ముందుగానే హెచ్చరించారు. ప్రమాదం పొంచి ఉందని గ్రహించి, ఏమైనా జరిగితే కాపాడటానికి ఆ జాలర్లు కూడా నీళ్లలో సిద్ధంగా నిలబడ్డారు.
ఆ సీన్ కోసం అమల మానసికంగా పూర్తిగా తన పాత్రలో లీనమైపోయి సముద్రం వైపు చూస్తూ నిలబడింది. పాత్రలోని తీవ్రతను అమల ఓన్ చేసుకోవడం చూసి దర్శకుడు కమల్ ఆమెను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ తర్వాత కెమెరా రోల్ చేసి ఆయన ‘యాక్షన్’ చెప్పగానే.. ఎవరూ ఊహించని విధంగా ఒక భారీ రాకాసి అల ఒక్కసారిగా వచ్చి వాళ్లను ముంచెత్తింది. ఆ అల ధాటికి అమలతో పాటు అక్కడున్న కెమెరా కూడా సముద్రంలోకి కొట్టుకుపోయింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో సెట్స్‌లో ఉన్నవాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. అదృష్టవశాత్తూ అక్కడే అప్రమత్తంగా ఉన్న మత్స్యకారులు వెంటనే నీళ్లలోకి దూకి ప్రాణాలకు తెగించి అమలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. మరోవైపు నీళ్లలో మునిగిపోతున్న కెమెరా అసిస్టెంట్.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, తన సొంత బిడ్డను కాపాడుకున్నట్లు ఆ కెమెరాను నీళ్లపైకి ఎత్తి పట్టుకున్నాడు. వెంటనే యూనిట్ సభ్యులు పరిగెత్తుకెళ్లి అతన్ని, కెమెరాను బయటకు లాగారు. ఈ ప్రమాదం నుంచి అమల ప్రాణాలతో బయటపడటం దేవుడి దయ అని కమల్ గుర్తుచేసుకున్నారు. కేవలం ఆ ఒక్క సీన్లోనే కాదు, మానసిక వైద్యశాలలో డాక్టర్ ముందు అమల నటించిన తీరు చూసి సెట్లో అందరూ ఆశ్చర్యపోయారని.. కట్ చెప్పిన తర్వాత కూడా ఆమె ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టిందని ఆమె డెడికేషన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ఈ సినిమా కోసం పనిచేశారు కాబట్టే.. దశాబ్దాలు గడిచినా ‘ఉల్లడక్కం’ ఒక క్లాసిక్‌గా మిగిలిపోయింది!
Also Read
తాజావార్తలు
-
Amala Akkineni : సముద్రంలో కొట్టుకుపోయిన అక్కినేని అమల.. ఎలా బతికిందంటే?
-
Charminar Temple Rush: చార్మినార్‌లో పండుగ సందడి.. భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
-
CBFC : తాజా నిబంధనలతో ఇండస్ట్రీలో కలకలం.. సెన్సార్ బోర్డుకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
-
Renu Desai: మెగా ఈవెంట్స్‌కి అకీరా, ఆద్యలు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
-
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!