CPS to OPS Conversion: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. డెడ్‌లైన్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPS to OPS Conversion: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలో ఉన్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. అర్హులైన ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS)లోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ అవకాశం రాష్ట్రంలోని CPS ఉద్యోగులందరికీ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్దిష్ట అర్హతలు కలిగిన ఉద్యోగులు మాత్రమే OPSలోకి మారేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
నియామక నోటిఫికేషన్ తేదీ కీలకం
2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే నియామక నోటిఫికేషన్ జారీ అయి ఉండాలి. ఆ నోటిఫికేషన్ ఆధారంగా 2004 సెప్టెంబర్ 1వ తేదీన లేదా ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ప్రస్తుతం CPS పరిధిలో కొనసాగుతున్న ఉద్యోగులు మాత్రమే OPS మార్పునకు అర్హులు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామక నోటిఫికేషన్ జారీ అయిన ఉద్యోగులకు ఈ అవకాశం వర్తించదు. ఉద్యోగంలో చేరిన తేదీ ఒక్కటే కాకుండా, నియామక నోటిఫికేషన్ జారీ అయిన తేదీ కూడా కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న అర్హులైన ఉద్యోగులతో పాటు, ఇప్పటికే పదవీ విరమణ చేసిన అర్హులైన ఉద్యోగులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అర్హులైన ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబ పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
Also Read
- SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
- Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
- CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
- AP Local Body Elections: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ స్టార్ట్..
NIDHI పోర్టల్‌లో దరఖాస్తు.. నాలుగు పత్రాలు తప్పనిసరి
CPS నుంచి OPSలోకి మారాలనుకునే అర్హులైన ఉద్యోగులు NIDHI పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం పోర్టల్‌లో ప్రత్యేకంగా ‘CPS-OPS Conversion’ పేరుతో ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
ప్రారంభ నియామకానికి సంబంధించిన నాలుగు కీలక పత్రాలను ధ్రువీకరించి సమర్పించడం తప్పనిసరి.
* నియామక నోటిఫికేషన్ (Recruitment Notification)
* సెలక్షన్ లిస్ట్ (Selection List)
* అపాయింట్మెంట్ ఆర్డర్ (Appointment Order)
* జాయినింగ్ ఆర్డర్ (Joining Order)
ఈ నాలుగు పత్రాలను సంబంధిత అధికారులు ధ్రువీకరించి అందించాల్సి ఉంటుంది. ప్రారంభ నియామక అధికారి 15 పని దినాల్లోగా ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలి. సమర్పించిన పత్రాల నిజానిజాలను సంబంధిత అధికారులు ఏడు రోజుల్లోగా నిర్ధారించాల్సి ఉంటుంది.
DDO పరిశీలన తర్వాత తదుపరి ప్రక్రియ
ఉద్యోగి సమర్పించిన దరఖాస్తు, ధ్రువపత్రాలను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO) పరిశీలించాల్సి ఉంటుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత 10 పని దినాల్లో తదుపరి ప్రక్రియ కోసం దరఖాస్తును పంపించాలి. ఉద్యోగి అర్హత, సమర్పించిన పత్రాల పరిశీలన అనంతరం సంబంధిత కాంపిటెంట్ అథారిటీ (Competent Authority) తుది నిర్ణయం తీసుకుంటుంది. కేవలం దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన OPSకు మారినట్లు కాదని, అర్హత నిర్ధారణతో పాటు అధికారుల ఆమోదం కూడా అవసరమవుతుంది.
OPSలోకి మారిన తర్వాత పెన్షన్ ప్రయోజనాలు
OPSలోకి మారేందుకు అర్హత పొందిన ఉద్యోగులకు ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 వర్తిస్తాయి. వీరికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఖాతాను కేటాయిస్తారు. ఇప్పటివరకు CPS కింద ఉద్యోగి జమ చేసిన వాటాను GPF ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రభుత్వ వాటాను మాత్రం ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. CPS ఖాతాలోని మొత్తాన్ని నగదు రూపంలో ఉద్యోగులు నేరుగా తీసుకునేందుకు అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, CPS నుంచి OPSకు మారే ఉద్యోగులు మరోసారి CPS విధానంలోకి తిరిగి వెళ్లేందుకు అవకాశం ఉండదు. కాబట్టి అర్హత కలిగిన ఉద్యోగులు ఈ నిర్ణయం తీసుకునే ముందు నిబంధనలను పూర్తిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
2026 డిసెంబర్ 31 చివరి గడువు
OPSలోకి మారాలనుకునే అర్హులైన ఉద్యోగులు 2026 డిసెంబర్ 31వ తేదీలోగా NIDHI పోర్టల్‌లో అందుబాటులో ఉన్న CPS-OPS Conversion ఆప్షన్ ద్వారా తమ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తంగా, CPS నుంచి OPSకు మారేందుకు ప్రభుత్వం కల్పించిన ఈ ఒక్కసారి అవకాశాన్ని వినియోగించుకోవాలంటే నియామక నోటిఫికేషన్ తేదీతో పాటు నాలుగు కీలక పత్రాలు, నిర్ణీత గడువులను ఉద్యోగులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
CBFC : తాజా నిబంధనలతో ఇండస్ట్రీలో కలకలం.. సెన్సార్ బోర్డుకు ఫిల్మ్ ఛాంబర్ లేఖ
-
Renu Desai: మెగా ఈవెంట్స్‌కి అకీరా, ఆద్యలు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
-
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
-
CPS to OPS Conversion: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. డెడ్‌లైన్ ఎప్పుడంటే..?
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
ట్రెండింగ్
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!