బంగ్లాదేశ్ దిగ్గజ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు వరుస షాక్‌లు తగిలాయి. ముందుగా షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించగా.. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్ సహా దేశ, విదేశీ బోర్డులకు సంబంధించి ఏ లీగ్‌లలో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధించింది. ఈమేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది. షకీబ్ అన్ని రకాల క్రికెట్‌లో…