Renu Desai: మెగా ఈవెంట్స్‌కి అకీరా, ఆద్యలు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renu Desai: మెగా కుటుంబంలో జరిగే శుభకార్యాలు, వేడుకల్లో అకీరా నందన్, ఆద్య తరచూ కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. అయితే, వాళ్లు ఆ ఫంక్షన్లకు వెళ్లడం వెనుక ఉన్న అసలు కారణంపై నటి రేణు దేశాయ్ తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పిల్లలు మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌కు వెళ్లడం వెనుక తన పెంపకం, సంస్కారమే కారణమని స్పష్టం చేశారు. “పిల్లలకు కుటుంబ విలువలు, పెద్దలను గౌరవించడం, అబద్ధాలు చెప్పకపోవడం వంటివి చిన్నప్పటి నుంచే నేర్పించాను. మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌కు వాళ్లు వెళ్లడం వెనుక ఉన్నది నా సంస్కారమే. తల్లిగా నా కర్తవ్యాన్ని నేను బాధ్యతతో నిర్వర్తిస్తున్నాను” అని తెలిపారు.
అదే సమయంలో సమాజం ఆలోచనా ధోరణిపై ఆమె నిర్మొహమాటంగా స్పందించారు. “మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు పిల్లలు వెళ్లినప్పుడు అక్కడ నేను ఉండను. నా సమక్షంలో ఉంటే వాళ్లు ఏదైనా పొరపాటు చేసినా వెంటనే గమనించి సరిదిద్దుతాను. కానీ నేను లేనిచోట, పదిమందిలో ఉన్నప్పుడు వాళ్లు ఏ చిన్న తప్పు చేసినా జనాలు క్షణాల్లో తీర్పు ఇచ్చేస్తారు.. ‘చూశారా, తల్లి పెంపకంలోనే లోపం ఉంది’ అంటూ నింద మొత్తం నా మీదే వేస్తారు. పిల్లలు మంచి చేస్తే క్రెడిట్ ఇవ్వకపోయినా, లోపం జరిగితే మాత్రం తల్లిపైనే బురదజల్లే మనస్తత్వం ఈ సమాజంలో ఉంది” అని పేర్కొన్నారు. అందుకే తన పెంపకాన్ని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అకీరా, ఆద్యలను మొదటి నుంచీ క్రమశిక్షణతో పెంచుతున్నట్లు ఆమె వివరించారు. మెగా ఈవెంట్స్‌కు పిల్లలు హాజరుకావడంపై రేణు దేశాయ్ ఇచ్చిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Renu Desai: మెగా ఈవెంట్స్‌కి అకీరా, ఆద్యలు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!
-
Fauzi : పెళ్లి పీటలెక్కిన రెబల్ స్టార్.. కానీ ?
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Ram Gopal Varma: “ఆ కుక్కలను పట్టించుకోవద్దు”.. ‘రామాయణం’పై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ రివ్యూ
-
Raaka Update: ముంబై టు హైదరాబాద్.. ‘రాకా’ షిఫ్ట్.!
ట్రెండింగ్
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!