Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్.. షోకాజ్ నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ వివాదంలో బాలీవుడ్ స్టార్స్ చిక్కుకున్నారు. మహారాష్ట్రలో నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడు నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ పాన్ మసాలా సంస్థకు చెందిన ‘‘విమల్ ఇలాయిచీ’’ ప్రకటనలో ముగ్గురు కలిసి నటించారు. ఈ యాడ్ ద్వారా పాన్ మసాలా బ్రాండ్‌కు పరోక్షంగా ప్రచారం చేసే అవకాశం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 15 రోజుల్లో యాడ్‌పై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేయబడ్డాయి.
తుకారం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఆహార భద్రత విభాగం జారీ చేసిన తొమ్మిది పేజీల నోటీసులో.. వెంటనే ఈ ప్రచారంలో భాగస్వామ్యాన్ని నిలిపివేయాలని, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి యాడ్‌కు సంబంధించిన ప్రచార కంటెంట్‌ను తొలగించాలని ముగ్గురు నటులను ఆదేశించింది. విమల్ ఇలాయిచీ అనే పదం వినియోగదారులకు విమల్ పాన్ మసాలా బ్రాండ్‌తో సంబంధాన్ని ఏర్పరిచేలా ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
- Varanasi Airport Gunfire: ఎయిర్‌పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
- CAG Railway Report: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా?.. CAG రిపోర్ట్‌లో సంచలన విషయాలు
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, విక్రయాలపై నిషేధం అమల్లో ఉందని FDA పేర్కొంది.ఈ కేసులో నటుల నుంచి వారి ఎండార్స్మెంట్ ఒప్పందాల పూర్తి వివరాలు, ప్రచార ప్రణాళికలు, చెల్లింపుల వివరాలు, వారు తమ స్థాయిలో చేసిన డ్యూ డిలిజెన్స్‌కు సంబంధించిన ఆధారాలను కూడా కోరింది. తప్పుదారి పట్టించే ఎండార్స్మెంట్లకు రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదే కాకుండా సంబంధిత వ్యక్తులు మూడేళ్ల పాటు ప్రోడక్ట్‌ల ప్రకటనలకు ఎండార్స్మెంట్ ఇవ్వకుండా నిషేధించే అవకాశం ఉందని నోటీసులు పేర్కొన్నాయి.
తాజావార్తలు
-
Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్.. షోకాజ్ నోటీసులు..
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
-
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
-
Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
-
Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!