ICC Rankings: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటిసారిగా ప్రపంచ నెం.1 స్థానం సాధించింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అన్నబెల్ సదర్లాండ్‌ను వెనక్కి నెట్టి దీప్తి ఈ ఘనత సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆమె చూపిన అద్భుత ప్రదర్శన ఈ విజయానికి కారణమైంది. డిసెంబర్ 21న విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది.…
Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana), సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal)ల వివాహం అధికారికంగా రద్దయింది. వారాల తరబడి సాగిన ఊహాగానాలకు తెరదించుతూ.. పెళ్లి రద్దు విషయాన్ని మందాన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ధృవీకరించింది. మందాన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో నేను మాట్లాడటం ముఖ్యమని భావిస్తున్నాను. నేను చాలా గోప్యతను కోరుకునే వ్యక్తిని,…
Shafali Verma: మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరగనున్న సెమీఫైనల్ పోరుకు ముందు భారత జట్టు శిక్షణ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన యువ సంచలనం షఫాలీ వర్మ తాజాగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన శిక్షణా సెషన్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీక రావల్ కాలు, మోకాలి గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో సోమవారం…