ముంబైలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. వెర్సోవా ప్రాంతంలోని ఓ స్పా సెంటర్ పై ముంబై పోలీస్ సోషల్ సర్వీస్ బ్రాంచ్ రైడ్ చేశారు. అందులో 9 మంది బాలికలను రక్షించారు. వెర్సోవాలోని చార్ బంగ్లా ప్రాంతంలోని రివైవల్ వెల్ నెస్ స్పాలో మసాజ్ పార్లర్ పేరుతో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేశారు. పోలీసుల విచారణలో మేఘాలయ, మణిపూర్, మిజోరాం నుండి నిరుపేద బాలికలను ఇక్కడికి తీసుకువచ్చి స్పా సెంటర్‌లలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్లు వెల్లడైంది. ఈ కేసుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Train Accident: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 15 మంది మృతి, 100 మందికి గాయాలు
స్పా సెంటర్ మేనేజర్ చంద్రకాంత్ నికమ్ అలియాస్ బంటీని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. రిమాండ్ దరఖాస్తు ప్రకారం.. స్పా యజమాని అతుల్ ధివర్ అతను ఈ సెక్స్ రాకెట్‌కు కింగ్‌పిన్. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. స్పా మేనేజర్ చంద్రకాంత్ నికమ్ అలియాస్ బంటీ, యజమాని అతుల్ ధివర్‌లపై ఎఫ్‌ఐఆర్ నంబర్ 552/2023లో సెక్షన్ 370 (3), 34 ఇతర సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న స్పా యజమాని అతుల్ ధివర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Priya Prakash Varrier: పండుగ పూట ప్రియా వారియర్ హాట్ ట్రీట్.. పిక్స్ చూశారా?
సోషల్ సర్వీస్ బ్రాంచ్ నిర్వహించిన దాడిలో.. పరారీలో ఉన్న నిందితుడు అతుల్ ధివార్ సోదరుడు హర్షద్ ధివార్‌ను స్పా సెంటర్‌లో విచారించారు. అతుల్ ధివర్ సోదరుడి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అతుల్ ధివార్ లేకపోవడంతో అతని సోదరుడు హర్షద్ ధివార్ స్పా పనులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో మరికొంత మంది బాలికలు ఉండవచ్చని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు.