Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతిచెందినట్టు అధికారులు గుర్తించారు.. జిల్లాలోని కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగగా.. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. తిరుమల నుండి తాడిపత్రికి వెళ్తున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నట్టుగా తెలుస్తుండగా.. ఘటనా స్థలంలోనే ఏడుగురు మృత్యువాత పడ్డారు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. మృతులు, క్షతగాత్రులు అంతా తాడిపత్రి వాసులుగా గుర్తించారు పోలీసులు.. ఇక, ఈ ప్రమాదంలో తుఫాన్ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.. ఆ వాహనంలో మృతదేహాలు ఇరుక్కుపోయాయి.. అతివేగమే ప్రమాదానికి కారణమని.. డ్రైవర్ నిర్లక్ష్యం దీనికి తోడు అయినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.. ఈ ఘటనకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, కొండాపురం మండలం ఏటూరు గ్రామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి వివరాలు పరిశీలిస్తే.. మృతులు.. 1.కే సుధీర్ కుమార్ తుఫాన్ డ్రైవర్, 2.కే సుధ, 3.కే లికిత్ కుమార్ రెడ్డి, 4.ఎల్ లక్ష్మీదేవి, 5.కే సునీల్ కుమార్ రెడ్డి, 6.సుభద్ర, 7. బుజ్జి రెండు సంవత్సరాల పాపగా గుర్తించారు.. వీరంతా తాడిపత్రి , బళ్ళారి పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా తేల్చారు పోలీసులు..