వివాహేతర సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చుపెడుతున్నాయి. కామకోరికలతో ప్రేమించినవారిని పక్కనపెట్టి పరాయి వారికి దగ్గరవుతున్నారు. దీని వలన ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇందులో సెలబ్రిటీలు మినహాయింపు కాదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ఎంతోమంది డైరెక్ట్ గానే తమ వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. తాజాగా ఒక సీరియల్ నటుడు రాసలీలలను అతని భార్య బయటపెట్టి, తనకు న్యాయం చేయాలని కోర్టుకెక్కడం సంచలనంగా మారింది.
వివరాలలోకి వెళితే.. తెలుగు బుల్లితెర నటుడు పవిత్ర నాథ్ శృంగార లీలలను అతని భార్య శశిరేఖ బట్టబయలు చేసింది. మొగలి రేకులు సీరియల్ లో దయ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర నాథ్ కి 12 ఏళ్ల క్రితం శశిరేఖతో వివాహం జరిగింది. వీరికి 11 ఏళ్ల పాప, 8 ఏళ్ల బాబు ఉన్నారు. పెళ్ళికి ముందు నుంచి అమ్మాయిల పిచ్చి ఉన్న పవిత్ర నాథ్ పెళ్లి తరువాత కూడా మారలేదు. కొన్నేళ్లు సవ్యంగా సాగిన వీరి కాపురంలో అతడి రాసలీలలు చిచ్చుపెట్టాయి. షూటింగ్ అని చెప్పి బయటికి వెళ్లడం, అర్ధరాత్రి అమ్మాయిలతో చాటింగ్, ఇది ఏంటి అని అడిగితే తనను కొట్టి, చిత్ర హింసలు పెట్టేవాడిని శశిరేఖ వాపోయింది. ఒకరోజు తన కళ్లముందే వేరే అమ్మాయితో బెడ్ రూమ్ లో అడ్ఢమాగా దొరికిపోయాడని, నాకు తెలిసినా కూడా అతనిలో మార్పు రాలేదని చెప్పుకొచ్చింది. తాను గొడవపెట్టుకున్న ప్రతిసారి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడిని తెలిపింది. కనీసం ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు కూడా డబ్బు ఇచ్చేవాడు కాదని వాపోయింది. ఇప్పటివరకు అతను పెట్టిన బాధలు భరించాను కానీ ఇకపై ఆ చిత్రహింసలు భరించలేకే కోర్టుకెక్కానని, తనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నట్లు ఆమె తెలిపారు. ఇక ఈ విషయమై పవిత్ర నాథ్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.