NTV Telugu Site icon

Gang Rape: హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు..

Gang Rape

Gang Rape

హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.. మైనర్ బాలికపై రెండు సార్లు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. పార్క్‌లో ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు నిందితులు మధుసూదన్, జయంత్, తరుణ్ కుమార్.. అనంతరం.. బాలిక చెవి కమ్మలు లాక్కున్నారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి బాలికి ఇంటికి సమీపంలో వదిలి వెళ్లిపోయారు యువకులు. అనంతరం.. నిందితులు బాలికను డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలో తండ్రి బ్యాగ్‌లో నుంచి 10 వేల రూపాయలు దొంగిలించి యువకులకు ఇచ్చింది బాలిక. కాగా.. బాలికను అత్యాచారం చేసిన విషయాన్ని మధుసూదన్ అనే యువకుడు మరో ఫ్రెండ్ సాయి కుమార్‌కి చెప్పాడు. దీంతో.. ఇంటికి సమీపంలో ఉండే సాయికుమార్ బాలికను కలిసి తనకు విషయం అంతా తెలుసని బెదిరింపులకు పాల్పడ్డాడు.

Read Also: Vandhe Bharat : వందే భారత్‌లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు ఖాళీ కడుపుతో ఉండాల్సిన అవసరం లేదు

బాలికను తన రూంకి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు యువకుడు సాయి కుమార్. అంతేకాకుండా.. న్యూడ్ వీడియోలు, అత్యాచారం వీడియో రికార్డు చేశాడు. తాను కూడా అత్యాచారం చేసానని స్నేహితులు మధు, జయంత్, తరుణ్‌కి చెప్పాడు. ఆ తర్వాత.. నలుగురూ కలిసి బాలికను మరోసారి బ్లాక్ మెయిల్ చేశారు. ఇంట్లో ఉన్న నగలు దొంగిలించి తీసుకురమ్మని బెదిరించారు. ఈ క్రమంలో తల్లి చైన్ దొంగిలించి యువకులకు ఇచ్చేందుకు బాలిక వెళ్తుండగా.. తల్లికి అనుమానం వచ్చి నిలదీసింది. దీంతో.. బాలిక తల్లికి అసలు విషయం చెప్పింది. ఈ క్రమంలో బాలిక పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. యువకులు మధుసూదన్, జయంత్, తరుణ్, సాయిలను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, అత్యాచారం, దోపిడీ, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

Read Also: BRS: బీసీల రిజర్వేషన్ల అంశంపై సీఎస్‌కు బీఆర్ఎస్ వినతిపత్రం..