ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్య స్వాతిపై అనుమానం పెంచుకుని.. గర్భవతి అన్న కణికరం లేకుండా అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త మహేందర్ రెడ్డి. తమ కూతురు మృతికి కారణమైన మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబీకులు నిందితుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలోనే స్వాతి హత్యకు ప్లాన్ చేశాడని ఎన్టీవీతో స్వాతి చెల్లెలు శ్వేత తెలిపింది. కామారెడ్డిగూడ శివారులో క్వారీలో తోసే ప్రయత్నం చేసినట్లు వెల్లడించింది. ఇద్దరం ఆత్మహత్య చేసుకుందామని చెప్పి క్వారీ దగ్గరికి తీసుకువచ్చి వదిలి వెళ్లినట్లు తెలిపింది.
Also Read:Amit Shah: కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందే.. ధన్‌ఖర్ గురించి అమిత్ షా ఏమన్నారంటే..!
సోదరి శ్వేతతో స్వాతికి లవ్ లెటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి పెళ్లి తర్వాత గ్రామంలో నాలుగు సార్లు పంచాయతీ చేసినట్లు తెలిపింది. ఏదో రకంగా స్వాతిని వదిలించుకునేందుకు మహేందర్ రెడ్డి పలుమార్లు ప్రయత్నాలు చేసినట్లు చెప్పింది. భోజనం పెట్టకుండా స్వాతిని వేధించాడని చెప్పుకొచ్చింది. నిందితుడికి ఉరిశిక్ష వేయకుంటే మేము ఊరుకోము.. మహేందర్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలి.. మహేందర్ రెడ్డి ని మేము బతకనివ్వము.. మా అక్కను ఎలా అయితే ముక్కలు చేశాడో మహేందర్ రెడ్డిని కూడా అలాగే హత్య చేసి ముక్కలు చేయాలి.. మహేందర్ రెడ్డి జైలు నుంచి వచ్చినా కూడా మేము వదలం అని స్వాతి సోదరి శ్వేత ఆగ్రహం వ్యక్తం చేసింది.