సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఐ వి ఎఫ్ అయితే రెండు మూడు లక్షలు మాత్రమే వస్తాయని భావించింది నమ్రత.. సరోగసి అయితే దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూలు చేయొచ్చని భావించింది. సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలను వసూలు చేసింది నమ్రత. ఇప్పటికే 30 మందికి పైగా సరోగసి కోసం డబ్బులు కట్టినట్లు గుర్తించారు. పోలీసులకు సరోగసి బాధితుల లిస్ట్ లభ్యమైనట్లు సమాచారం.
Also Read:Deoghar Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న యాత్రికులతో వెళ్తున్న బస్సు.. 18 మంది మృతి
ఐవిఎఫ్ కోసం వస్తున్న వారు హైదరాబాద్ సెంటర్ ను కాంటాక్ట్ చేస్తే వైజాగ్ కి పంపించి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. వైజాగ్ కి వచ్చే దంపతులను విజయవాడ హైదరాబాద్ పంపించి వసూల్లకు పాల్పడ్డారు. దంపతులకు అనుమానం రాకుండా సరోగసి మదర్ తో కాంటాక్ట్ లేకుండా జాగ్రత్త పడింది నమృత. ఇప్పటివరకు ఎన్ని సరోగసిలు జరిగాయన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.