డబ్బు మాయలో పడి పవిత్రమైన వైద్య వృత్తికి కలంకం తెచ్చారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆసుపత్రి వైద్యులు. సంతానం లేని దంపతులను నిండా ముంచి లక్షలు కాజేసి మానసిక క్షోభకు గురిచేశారు. పిల్లలు లేని లోటును తీర్చుకోవాలనే ఆరాటంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సంప్రదించడమే వారు చేసిన తప్పైపోయింది. ఎవరో వ్యక్తుల స్పెర్మ్, అండాలు సేకరించడం, వాటి ద్వారా పిండాలను సృష్టించడం, ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు…
సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఐవిఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరగోసి వైపు మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. ఐ వి ఎఫ్ అయితే రెండు మూడు లక్షలు మాత్రమే వస్తాయని భావించింది నమ్రత.. సరోగసి అయితే దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూలు చేయొచ్చని భావించింది. సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలను వసూలు చేసింది నమ్రత. ఇప్పటికే 30 మందికి పైగా సరోగసి కోసం డబ్బులు కట్టినట్లు గుర్తించారు.…
మెడికల్ మాఫియాకు హద్దులు లేకుండా పోతున్నాయి. వైద్యులు దేవునితో సమానం అని జనం నమ్మి వస్తే.. తాము ఏం చేసినా చెల్లుతుందనే రీతిలో మెడికల్ మాయగాళ్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఓ టెస్ట్ ట్యూబ్ సెంటర్ చేసిన నిర్వాకం.. పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి వారు చేసే బాగోతాన్ని బయటపెట్టింది. అసలు ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఏం జరిగింది? పోలీసుల సోదాల్లో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? పిల్లలు లేని దంపతుల బాధ వర్ణనాతీతం.. పిల్లలు…
Death Certificate: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ డివిజన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రి నుండి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ ఆస్పత్రిలో రోగి చనిపోయినట్లు డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కాకపోతే, ఆ తర్వాత అతను జీవించి ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్థరాత్రి, జబల్‌పూర్‌లోని గ్వారిఘాట్‌కు చెందిన 66 ఏళ్ల ఇంద్రజిత్ శుక్లా అనే రోగి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరాడు. ఆ…