తమిళ స్టార్ హీరో అజిత్ గురించి పరిచయాలు అవసరం లేదు… తెలుగులో కూడా మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో ఒకరు అజిత్.. ఈయన ఇటీవల నటించిన చిత్రం తుణివు.. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో సినిమా చెయ్యబోతున్నాడ.. ఈ సినిమా హీరోయిన్ ఎవరనే విషయం పై యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు కానీ హీరోయిన్ గా తెలుగు హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
త్రిషకు ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంది.. అజిత్ సినిమాకు సైన్ చేస్తుందో లేదో చూడాలి.. మరోవైపు యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఈ సినిమాలో నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.మే నెల 1వ తేదీన నటుడు అజిత్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా విడాముయర్చి చిత్రానికి సంబంధించిన ఏదైనా అప్‌డేట్ వస్తుందనే ఆశాభావంతో అజిత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అజిత్ సినిమాలు రీరిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి.. ఈ సినిమాలో అజిత్ సరసన ఏ హీరోయిన్ నటిస్తుందనే విషయం పై ఫ్యాన్స్ లో పెద్ద చర్చే జరుగుతుంది.. త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. మరి మేకర్స్ ఎవరిని ఫిక్స్ చేశారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇకపోతే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కాబోతుంది..