ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తారు. అమాయకులు, బలం లేని వాళ్లు ఉంటే ఇక అంతే.. బెదిరించడం లేదా దాడులు చేయడం కామన్ అవుతోంది. పైగా కొంత మంది అధికారుల అండదండలతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. కానీ అలాంటి వారికి చెక్ పెడుతున్నారు పోలీసులు. ఇదిగో ఇది ఆదిలాబాద్‌లోని మావల. ఇక్కడ ఓ వ్యక్తి 2011 కొనుగోలు చేసిన 7 ప్లాట్లను ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మరో రాజకీయ పార్టీ నేత కలిసి 2024లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.…
దేశ సంపద, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న జవాన్లను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జవాన్ల భూములను కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ జవాన్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ జవాన్ తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పని…