టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై మంత్రి సీదిరి అప్పల రాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోకేష్ నాకు చాలెంజ్ చేసారు.. మత్స్యకారులకు, ఉత్తరాంధ్రాకు ఏం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చినబాబు నీకు దమ్ము, సిగ్గు లజ్జా ఉంటే.. మీ నాన్న కొబ్బరికాయ కొట్టిన పోర్టు, హార్పర్ ఇది అని చూపించు అని చాలెంజ్ చేశారు. వెనుకబడిన జిల్లాను అభివృద్ధి ప్రాంతాల నడుమ నిలబెట్టడానికి జగన్ కృషి చేస్తున్నారని మంత్రి సీదిరి తెలిపారు.
పేదలంటే చంద్రబాబు నాయుడికి కోపం, చిరాకు వస్తుందని ఆయన విమర్శించారు. మత్స్యకారుల తొక్కతీస్తాం, తోలుతీస్తామని గతంలో చంద్రబాబు వార్నాంగ్ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నాయిబ్రాహ్మణుల తోకలు కట్ చేస్తామన్నారు.. బీసీలు జడ్జిలుగా పనికి రారని లెటర్ రాసాడు అని మంత్రి సీదిరి అప్పల రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. కుప్పంలో దొంగ ఓట్లతోనే ఆయన గెలుస్తున్నాడని మంత్రి సీదిరి అన్నారు. కుప్పంలోనే 30 నుంచి 40వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే భయంతో బాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడంటూ మంత్రి మండిపడ్డారు.
తెలంగాణ మంత్రులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు.
Off The Record: మెదటిసారి ఎమ్మెల్యే అయినా టైం కలిసి రావడంతో మంత్రి పదవి దక్కించుకున్నారు సీదిరి అప్పలరాజు. ప్రస్తుతం పలాసలో జరుగుతున్న పరిణామాలే ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సొంత మనుషులే రెబల్స్‌గా మారి తెగ టెన్షన్ పెడుతున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పలరాజు నాయకత్వం మాకొద్దు అని బహిరంగంగానే చెప్పేస్తున్నారు అనుచరులు. మొదట్లో పరిస్ధితులు అంతా బాగానే ఉండేవట. పలాసలో ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి? ఎవరు పార్టీ గెలుపు కోసం కృషి చేశారు? అనే…