‘7/G బృందావన కాలనీ’ ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కు టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.సూర్య మూవీస్ పతాకం పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మించారు.ఈ మూవీ అప్పట్లో యూత్‍ను ఎంతగానో ఆకట్టుకుంది. 2004లో 7/G రెయిన్‍బో కాలనీ పేరు తో తమిళం లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది… అదే ఏడాది తెలుగు లో ‘7/G బృందావన కాలనీ’ పేరుతో విడుదల అయింది తెలుగులో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించింది.. సుమారు 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.తాజాగా రీ-రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది.7/G బృందావన కాలనీ సినిమా సెప్టెంబర్ 22 వ తేదీన థియేటర్ల లో రీ-రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమాలో రవి కృష్ణ, సోనియా అగర్వాలో హీరో హీరోయిన్ లు గా అద్భుతం గా నటించారు.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమా కే హైలైట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. దర్శకుడు సెల్వరాఘన్ ఈ విభిన్నమైన ప్రేమ కథను తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాను యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు..దర్శకుడు సెల్వ రాఘవన్ హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను ఎంతో అద్భతంగా తెరకెక్కించారు. అలాగే కొడుకు గురించి ఓ మధ్య తరగతి తండ్రి ఎలా ఆలోచిస్తారన్న అంశాన్ని కూడా ఎంతో భావోద్వేగంగా చూపించారు.హీరో తండ్రి పాత్ర లో చంద్రమోహన్ అద్భుతంగా నటించారు.అలాగే సినిమాలో సుమన్ శెట్టి కామెడీ కూడా అద్భుతం గా ఉంటుంది.. ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా థియేటర్లలోకి రావడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు