Tirumala: తిరుమలలో భద్రత ప్రశ్నార్థకం..! టీటీడీపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయంలో.. భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్లతో ప్రవేశం పూర్తిగా నిషిద్ధం. భక్తులు సెల్‌ఫోన్లు, కెమెరాలు వంటి వాటితో శ్రీవారి సన్నిధిలోకి వెళ్లకుండా.. టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే, మూడంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని మరీ.. శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించడం, ఆ దృశ్యాలు వెలుగుచూడటం వంటి వరుస పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా జరిగిన ఘటనతో తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగుచూసింది.
తిరుమలలో కొద్ది రోజుల క్రితమే శ్రీవారి ఆనంద నిలయాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు సంచలనం రేపాయి. ఇక ఇటీవల తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారంటూ టీటీడీకి మెయిల్ ద్వారా సమాచారం రావడం.. భద్రతాధికారులు, సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించడం.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగుచూడటం సంచలనంగా మారింది. ఆలయంలో నలువైపుల నుంచి శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించిన దృశ్యాలు.. తిరుమలలో భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందనే దానికి నిదర్శనంగా నిలిచాయి.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
మూడు అంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని ఆలయంలోకి కెమెరాతో ఎలా ప్రవేశించారు? ఆనంద నిలయ దృశ్యాలను చిత్రికరించే సమయంలో భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం కొరవడింది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు సీరియస్‌గా స్పందించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆలయ దృశ్యాలను మహిళా భక్తురాలు చిత్రీకరించినట్లుగా భద్రతాధికారులు గుర్తించారు. మొబైల్ ఫోన్‌తో కాకుండా.. సీక్రెట్ కెమెరాతో వీడియో తీసినట్లుగా కూడా గుర్తించారు. ముందుగా సదరు మహిళను గుర్తించే పనిలో పడ్డారు. ఆమె ఎవరని తేలితే.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.
అయితే, శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తుంటారు భద్రతా సిబ్బంది. సెల్‌ఫోన్, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్భందీగా భద్రత ఉన్నప్పటికీ.. ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి కెమెరా తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై.. భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో భద్రత ఇదేనా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, టీటీడీ అధికారులు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ విజిలెన్స్ అధికారి బాలిరెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!