వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో హెలికాప్టర్ వివాదంలో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జగన్.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో జనం పెద్దఎత్తున దూసుకురావడంతో హెలికాప్టర్ దెబ్బతింది. దీంతో వీఐపీని అందులో తీసుకెళ్లలేమని పైలట్లు చెప్పారు. దీంతో జగన్ రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్లారు. అయితే, ఇందులో నిజానిజాలెంత అనే దానిపై విచారణ చేపట్టారు.
READ MORE: Virginia Giuffre: ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గియుఫ్రే ఆత్మహత్య
రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి మాజీ సీఎం జగన్ వచ్చిన సమయంలో హెలికాప్టర్ వద్ద చోటు చేసుకున్న ఘటనలపై విచారించేందుకు పైలట్ అనిల్ కుమార్ కు పోలీసులు రెండో నోటీసు జారీ చేశారు. మే 2న చెన్నేకొత్తపల్లిలోని రామగిరి పోలీసు సర్కిల్ కార్యాలయానికి రావాలని నోటీసు ఇచ్చినట్లు సమాచారం.
READ MORE: Andhra Pradesh: గుడ్‌న్యూస్.. రూ.1,121.20 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల..
మాజీ సిఎం జగన్ హెలికాఫ్టర్ ఘటనకు సంబంధించి విచారణకు రావాలని గతంలో పైలెట్ అనిల్ కుమార్, కో పైలెట్ శ్రేయస్ జైన్ కు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసుల మేరకు చెన్నేకొత్తపల్లి పోలీసుల ఎదుట ఈనెల 16న కోపైలెట్ శ్రేయస్ జైన్ హాజరయ్యారు. కో పైలట్ ని డీఎస్పీ, సీఐలు సుదీర్ఘంగా విచారించారు. సుమారు 3 గంటల పాటు …100 ప్రశ్నలు అడిగారు. కుట్ర కోణం గురించి లోతుగా ఆరాతీశారు. ఈనెల 16 విచారణకు గైర్హాజరైన పైలెట్ అనిల్ కుమార్ విచారణకు రావాలని మరో సారి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.