వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో హెలికాప్టర్ వివాదంలో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జగన్.. పాపిరెడ్డిపల్లి పర్యటనలో జనం పెద్దఎత్తున దూసుకురావడంతో హెలికాప్టర్ దెబ్బతింది. దీంతో వీఐపీని అందులో తీసుకెళ్లలేమని పైలట్లు చెప్పారు. దీంతో జగన్ రోడ్డు మార్గాన బెంగళూరుకు వెళ్లారు. అయితే, ఇందులో నిజానిజాలెంత అనే దానిపై విచారణ చేపట్టారు.
ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుగుతోంది.