Actor Sree lekha Mitra loses Rs 1 lakh to Scammer: ఈ మధ్య సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా మందికి ఈ అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆన్ లైన్ లావాదేవీల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. చదువురానీ వారు, చదువుకున్న వారు కూడా వీటి బారిన పడుతున్నారు. తెలయకుండా వచ్చే లింక్ లపై క్లిక్ చేయవద్దని, అపరిచి నెంబర్ల నుంచి వచ్చిన ఫోన్ కాల్ లో మీ ఓటీపీ వివరాలు చెప్పవద్దని ప్రభుత్వం పదే పదే ప్రకటనలు ఇస్తున్నా ఇంకా చాలా మంది ఆ తప్పు చేస్తూ డబ్బును పోగొట్టుకుంటూనే ఉన్నారు.
Also Read: Guinness world records: సినిమాలు చూస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డు.. ఏడాదిలో ఎన్ని చూశాడంటే?
తాజాగా ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. ఏకంగా కొన్ని నిమిషాలలోనే ఆమె లక్ష రూపాయలు పోగొట్టుకున్నారు. ఆమెకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న నటి తనలా ఎవరూ మోసపోవదంటూ పేర్కొన్నారు. ఇక ఆ పోస్ట్ ఈ ఘటన ఆగస్టు 29న జరిగినట్లు తెలిపిన నటి ఆ సమయంలో తాను జ్వరంతో ఉన్నట్లు తెలిపారు. సైబర్ నేరగాళ్లు తనకు ఫోన్ చేసి విద్యుత్ బిల్లు చెల్లించేందుకు ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని తనని ఒప్పించారని తెలిపారు. వారు చెప్పినట్లు చేయడంతో క్షణాల్లోనే తన బ్యాంక్ ఖాతా నుంచి లక్షకు పైగా డబ్బు మాయం అయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరంలో ఉన్న తాను సైబర్ నేరగాళ్లు చెబుతున్న దాన్ని పసిగట్టలేకపోయినట్లు ఆమె పేర్కొ్న్నారు. తనలా ఎవరు మోసపోవద్దని సూచించారు. ఇక తరువాత రోజే నటి పుట్టిన రోజు కావడం విశేషం. అంటే పుట్టిన రోజు ముందురోజు ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది.