ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1 టీ20 టోర్నీ జరుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయి. ఎంఎస్‌డీసీఏ, బ్రైనియాక్స్ బీ, పల్లవి ఫౌండేషన్ సహకారంతో స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-1ను నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్ టీ20 ప్రీమియర్ లీగ్ బాయ్స్ అండర్-14, గర్ల్స్ అండర్-16 కేటగిరీల్లో జరుగనుంది.