సారా అలీఖాన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సారా అలీఖాన్. ఈ బ్యూటీ ‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. తండ్రి ఇమేజ్ తో ఇండస్ట్రీకి పరిచయం అయినా సారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. సంప్రదాయంగా కనిపిస్తూనే, గ్లామర్ మెరుపులు మెరిపించి ఆకట్టుకుంటుంది..అలాగే రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్రాళ్లను కూడా ఎంతగానో అలరిస్తోంది. ఈ భామ షూటింగ్స్ లో ఏ చిన్న బ్రేక్ దొరికినా కూడా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటుంది. ప్రసిద్ధ హిందూ ఆలయాలను ఈ భామ నిత్యం సందర్శిస్తుంది. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది.ఈభామగ్లామర్ రోల్స్ తో పాటు నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె `ఏ వతన్ మేరే వతన్` సినిమాలో నటిస్తోంది.
ఈ చిత్రంలో ఆమె స్వాతంత్య్ర పోరాట యోధురాలిగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సారా లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత అయిన కరణ్ జోహార్ ఇన్స్టాగ్రామ్ లో ఈ మోషన్ పోస్టర్ ని షేర్ చేశారు.ఈ తాజా పోస్టర్ లో సారా అలీ ఖాన్ క్యారెక్టర్ ను రివీల్ చేశారు. అంతేకాదు, ఈ మోషన్ పోస్టర్ కు ‘ఆజాద్ ఆవాజీన్, ఖైద్ నహీ హోతీ` అనే స్లోగన్ ను క్యాప్షన్ గా పెట్టారు. సారా పాత్రను ఉషా మెహతాగా ప్రేక్షకులకు మేకర్స్ పరిచయం చేశారు. బూడిద రంగు అంచుతో కూడిన తెల్లటి కాటన్ చీరలో సారా లుక్ అదిరింది.. ఎడమ చేతికి నల్లటి వాచ్, నుదిటి మీద చిన్న బొట్టు అలాగే చిన్న జడను అల్లిన తీరు స్పెషల్ గా కనిపించాయి. సారా మైకులో ఏదో సందేశం ఇస్తున్నట్లుగా చూపించారు. ఈ క్యారెక్టర్ కు సంబంధించి సారా మేకోవర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె ఎంతో ధైర్యవంతురాలిగా కనిపించనున్నట్లు సమాచారం..ఈ సినిమాను కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా ఈ మూవీ విడుదల కానుంది. భారతీయుల స్వేచ్ఛ కోసం స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో ధైర్యంగా పోరాడిన ఓ మహిళ కథను ఈ సినిమాలో చూపించనున్నారు