HONOR X9C 5G: భారతీయ మార్కెట్ ప్రపంచంలోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్ సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. వినియోగదారులను ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసే హానర్ (HONOR) సంస్థ తన తాజా మోడల్ HONOR X9C 5Gను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్టు అధికారికంగా టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ ను జూలై నెలలో రాబోతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ లాంచ్ కానునాట్లు సంస్థ ప్రకటించింది.
నిజానికి ఫిబ్రవరి నెలలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ప్రాథమికంగా చెప్పినప్పటికీ, ఇప్పుడు మరోసారి టీజర్ ద్వారా అధికారికంగా లాంచ్ తేదీ దగ్గర్లో ఉందని సంకేతాలను ఇచ్చింది. ఇప్పటివరకు ఈ ఫోన్ మలేషియా, UAE లాంటి ఆసియా దేశాల్లో లాంచ్ అవ్వగా, యూరప్ లో మాత్రం ఈ మోడల్ ను HONOR Magic 7 Lite పేరుతో లాంచ్ చేశారు. ఇక టీజర్ ను గమనించినట్లయితే, ఈ HONOR X9C 5G మొబైల్ బ్లాక్, గ్రీన్ రంగులలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు అర్థమవుతుంది. ప్రీమియం లుక్, క్లాస్‌కు తగ్గ డిజైన్ తో ఈ ఫోన్ అద్భుతంగా కన్పడడుతుంది. ఇక మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..
Read Also:Iran Supreme Leader: ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ.. వేరే దేశానికి మకాం మార్చే ఛాన్స్..?
డిస్ప్లే:
ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల 120Hz AMOLED స్క్రీన్ తో రాబోతుంది. ఈ మొబైల్ 1.5Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయగలదు. అలాగే స్క్రీన్ బ్రైట్‌నెస్ గరిష్టంగా 4000 నిట్స్ వరకు ఉండనుంది. దీనితో మొబైల్ విషునిచే సమయంలో మంచి అనుభూతిని అందిస్తుంది. అలాగే 3840Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ ఫీచర్ వలన కళ్లకు నష్టం లేకుండా స్క్రీన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌సెట్ ను వినియోగించనున్నారు.
కెమెరా:
HONOR X9C 5G మొబైల్ వెనుక భాగంలో 108MP ప్రధాన కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉండనున్నాయి. ఇక వీటికి తోడుగా ఫోటో, వీడియో స్టెబిలిటీ కోసం OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Also:Kanaka Durgamma: నేటి నుంచి ఇంద్రకిలాద్రిపై వారహి నవరాత్రులు, ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాలు!
బ్యాటరీ:
ఈ మొబైల్ కు 6600mAh కెపాసిటీ కలిగిన భారీ కార్బన్-సిలికాన్ బ్యాటరీతో ఉండడం వల్ల ఫోన్ ఎక్కువకాలం వాడుకోవచ్చు. అలాగే దీనికి 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
బలమైన నిర్మాణం:
ఈ మొబైల్ కు స్విట్జర్లాండ్ SGS నుండి 5-స్టార్ రిలయబిలిటీ సర్టిఫికేట్ లభించింది. వీటితోపాటు IP65 రేటింగ్ ద్వారా దుమ్ము, నీటి చిందులకు ఫోన్ రెసిస్టెంట్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా 2 మీటర్ల ఎత్తునుండి నుంచి కింద పడినా మొబైల్ దెబ్బ తినని విధంగా దీన్ని రూపొందించారు.
మొత్తంగా.. ఈ ఫోన్ ఒక్క లుక్ కే కాదు. పనితీరు, బలమైన నిర్మాణం, కెమెరా, బ్యాటరీ, స్క్రీన్ ప్రతి అంశంలోను ప్రీమియం అనిపించేలా ఉంది. జూలైలో అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా HONOR X9C 5G భారత్‌లో అధికారికంగా విడుదల కానుంది. ధర మరియు లాంచ్ డేట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు హానర్ సంస్థ పేర్కొంది.