Sankranthiki Vasthunam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, వెంకటేశ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ సినిమాను పూర్తి వినోదాత్మకంగా మలచాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికలుగా అలరించగా.. వీఎటీవీ గణేష్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తుంది. సుదీర్ఘ కాలం తర్వాత వెంకటేశ్ నుంచి వచ్చిన పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో, ఈ సంక్రాంతికి ఇది ప్రేక్షకులకి పక్కా పండగ సినిమా అని చెప్పవచ్చు.
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాలలో మాతరమే కాకుండా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను రాబడుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది. ఈ సినిమా విడుదలైన కేవలం కొద్ది గంటల్లోనే 350K డాల్లర్స్ వసూళ్లను సాధించిందని తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమా వసూళ్లలో ముందుముందు మంచి పెరుగుదల కనపడుతుంది. ఉత్తర అమెరికా ప్రేక్షకులు సినిమా కామెడీ, ఎమోషన్, పండుగ వాతావరణం అన్నింటినీ ఆస్వాదిస్తూ, థియేటర్లకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. సినిమా ప్రత్యేకంగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడడానికి ముందే పెద్ద స్క్రీన్ ఎఫెక్ట్‌ను ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ థియేటర్లకు పరుగెత్తుతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మంచి వసూళ్లను రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Sankranthi Sandadi Shuru 💥🔥🔥#SankranthikiVasthunam has taken the North America box office by storm, grossing over $𝟑𝟓𝟎𝐤 and Counting.✌️#సంక్రాంతికివస్తున్నాం IN CINEMAS NOW.
Victory @venkymama @anilravipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo #Dilraju #Shirish… pic.twitter.com/hBaxDqatdK
— Sri Venkateswara Creations (@SVC_official) January 14, 2025