వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టులో సంజూ శాంసన్ వికెట్ కీపర్ గా స్తానం సంపాదించాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్‌గా వ్యవహరించిన శాంసన్ తన కెప్టెన్సీతోనే కాకుండా నిలకడైన బ్యాటింగ్ తో సెలక్షన్ కమిటీని ఆకట్టుకున్నాడు. ఇది అతనికి జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో స్థానాన్ని సంపాదించిపెట్టింది. కాగా, టీ20 ప్రపంచకప్ కు తన ఎంపిక గురించి తెలుసుకున్న సంజూ పోస్ట్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Also read: Rupali Ganguly: బీజేపీలోకి ప్రముఖ నటి రూపాలీ గంగూలీ..
అతను భారత జట్టు జెర్సీని ధరించి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. దానికి తన మాతృభాష మలయాళంలో “వెరుప్ తునిట్ట కుప్పాయమ్” అని శీర్షికను కథ చేసాడు. దీని అర్థమేమిటంటే.. ‘ఎంతో శ్రమతో, చెమటతో కుట్టిన చొక్కా’. నిజానికి, సంజు శాంసన్ 2015లో జింబాబ్వేపై తన టీ 20 అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. సంవత్సరాలుగా, అతను కేవలం 25 టీ 20 లలో మాత్రమే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అయితే అందులో కేవలం 18.70 సగటు, 133.09 స్ట్రైక్ రేట్‌తో 374 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యుత్తమ స్కోరు 77. ఇక మరోవైపు ఐపీఎల్ లో అతని ప్రదర్శన చాలా బాగుంది. ఐపీఎల్ లో 161 మ్యాచ్ లు ఆడిన అతను 30.96 సగటుతో, 139.04 స్ట్రైక్ రేట్ తో 4273 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 24 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ స్కోరు 119 పరుగులుగా ఉంది. ఇక ఐపీఎల్ 17 సీజన్ లో మెరిశాడు. 9 ఆటలలో., 77 సగటు, 161 స్ట్రైక్ రేట్ తో 385 పరుగులు చేసి బికారి ఫామ్ కలిగి ఉన్నాడు. ఇందులో అత్యుత్తమ స్కోరు 82 నాటౌట్ కాగా., 4 అర్ధ సెంచరీలను బాదాడు.
Also read: Lal Salaam : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘లాల్ సలామ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఐపీఎల్‌లో క్రికెట్‌లో విజయం సాధించినప్పటికీ, ఆపై చెప్పుకోతగ్గ అవకాశాలు లేకపోవడంతో శాంసన్ అభిమానులు ఎప్పుడూ నిరాశ చెందుతానే ఉన్నారు. జట్టులో చోటు లేకపోయినా శాంసన్ ఏనాడూ బాధపడలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఓవరాల్‌గా టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడంపై సంజూ స్పందన ఇప్పుడు వైరల్ గా మారింది.