Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
- ఉద్ధవ్ శివసేనలో ఎంపీల తిరుగుబాటు..
- తొమ్మిది మందిలో ఆరుగురు ఎంపీలు ఢిల్లీకి..
- ఒక్కో ఎంపీకి రూ. 50 కోట్లు ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanhay Raut: ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) మరోసారి చీలిక వర్గంగా మారింది. ఆ పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తిరుగుబాటు చేసిన ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. వీరంతా స్పీకర్‌ను తమది ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఎదురైన పరిస్థితులే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎదుర్కోంటోంది.
ఈ తిరుగుబాటుపై ఉద్ధవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఢిల్లీ నివాసంలో నిర్వహించిన సమావేశానికి ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మీడియా సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, పార్టీని వీడాలనుకునే ఎంపీలు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తిరుగుబాటు ఎంపీలను ద్రోహులుగా అభివర్ణించారు. తీవ్రస్థాయిలో బూతులు తిట్టాడు. ఈ వెధవలు వెళ్లిపోవాలి, వారిని నరకవద్దు అని ఆగ్రహంగా అన్నారు. ద్రోహం చేయడం వారి రక్తంలో ఉందని దుయ్యబట్టారు. తన తిట్లను బీప్ చేయవద్దని కోరుతూనే, మరాఠీలతో ఇలాంటి పదజాలం వాడటం సాధారణమే అని అన్నారు. తప్పు చేసిన వారిపై, అవినీతికి పాల్పడిన వారిపై మనం పూలు కురిపిస్తామా.? అని ప్రశ్నించారు.
Also Read
- UP: సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
- Uddhav Thackeray: ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలిపోయింది.. ఎంపీల తిరుగుబాటు..
- Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్‌సభ స్పీకర్‌తో భేటీకి ఎంపీలు రెడీ..
ఇదే కాకుండా, ఎంపీలను డబ్బులతో కొంటున్నారని మండిపడ్డారు. తిరుగుబాటు చేయడానికి ఎంపీలకు ఒక్కొక్కరికి రూ. 15 కోట్లు ఆఫర్ చేస్తున్నారనే విషయం దిగ్భ్రాంతి కలిగిస్తోందని, కొందరు ఎంపీలు పక్షం మారేందుకు రూ. 50 కోట్లను కూడా ఆఫర్ చేస్తు్న్నారని ఆరోపించారు. ఎంపీల కొనుగోలు ప్రయత్నంపై మంగళవారం రాత్రి ఒక వ్యక్తి తనకు సమాచారం ఇచ్చారని, రూ. 50 కోట్లలో, రూ. 15 కోట్లు ఈ రాత్రికి అందుతాయని, డబ్బు చేతికి అందిన తర్వాతే ఎంపీలు విమానం ఎక్కారని సంజయ్ రౌత్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
-
Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!
-
UP: సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
-
Pawan Kalyan: “ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!”.. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
-
Uddhav Thackeray: ఉద్ధవ్ శివసేన మళ్లీ చీలిపోయింది.. ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!