Sandeep Kumar Sultania: రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా..!
- రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు
- ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ కుమార్ సుల్తానియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeep Kumar Sultania: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పదవిలోకి సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె. రామకృష్ణారావు కొనసాగుతుండగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రిటైర్మెంట్ అయ్యారు. ఆమె స్థానంలో కె. రామకృష్ణారావు సీఎస్‌గా నియమితులవడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానం ఖాళీ అయ్యింది. దీనితో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ పదవిలోకి సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
నేడు (మే 13) సాయంత్రం లేదా రేపు ఉదయం సందీప్ సుల్తానియా తన కొత్త బాధ్యతలు అధికారికంగా చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. సుల్తానియాను ఆర్థిక శాఖకు నియమించడంపై అధికార వర్గాల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విధానాల అమలు, బడ్జెట్ నిర్వహణ, ఆర్థిక అనుభవం కలిగిన అధికారిగా ఆయనకు మంచి పేరు ఉంది.
Read Also: Legends Championship: కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత.. బరిలోకి గబ్బర్, రైనా
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!