Sandeep Kumar Sultania: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పదవిలోకి సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె. రామకృష్ణారావు కొనసాగుతుండగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…
తెలంగాణ రాష్ట్ర కొత్త ఛీఫ్ సెక్రెటరీగా కె. రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. 1989 బ్యాచ్‌కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి 2021 జనవరి నుంచి సీఎస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1991 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…
అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో యాసంగి పంట సాగుకు సరిపడ సాగు నీరు అందించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. యాసంగి సీజన్ పంట సాగు, రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది. అయితే.. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి సమావేశంలో మంత్రులు, సెక్రటరీలు, హెచ్వోడీలు పాల్గొంటారు.
ఢిల్లీ పర్యటన కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిన్న సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్ళిన విషయం తెలిసిందే. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక పరిణామంలో కేసీఆర్ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. భారత రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడమే కాకుండా, ఆయన కొందరు ప్రతిపక్ష నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయన టిఆర్ఎస్ ఎంపీలతో సమావేశమై పాలు, పాల ఉత్పత్తులు,…
తెలంగాణ నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వం. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రూప్ 4 కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని… దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సోమేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే టీఎస్పీఎస్పీ గ్రూప్…
హిందీ కొన్ని రాష్ట్రాలకు పెద్ద సమస్యగా మారుతోంది.. అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య కమ్యూనికేషన్ లేకుండా చేస్తోంది లాంగ్వేజ్.. చివరకు మా వళ్ల కాదు బాబోయ్ అంటూ కేంద్రానికి లేఖ రాసేవరకు వెళ్లింది పరిస్థితి.. ఇంతకీ హిందీ భాష ఇబ్బందిపెడుతోన్న ఆ రాష్ట్రం ఏంటి..? ఆ లేఖ సంగతి ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు మిజోరాం ముఖ్యమంత్రి పూ జోరంతంగ.. తమ కేబినెట్‌లోని మంత్రులకు హిందీ రాదని…