టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో దూసుకుపోతున్న హీరోయిన్లలో ఒకరు సంయుక్త మీనన్.. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ తో పరిచయం అయ్యింది.. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది. ఆతర్వాత కళ్యాణ్ రానాకు జోడీగా బింబిసార లో నటించింది. ఈ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే ధనుష్ తో జోడీగా నటించే ఛాన్స్ అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే లో చేసింది సంయుక్త ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సంయుక్త మరో కుర్ర హీరో సినిమాలో నటించింది..
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష లో నటించింది.. ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత సైలెంట్ అయిన ఈ అమ్మడు మహేష్ బాబు లో నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఆమె ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సంయుక్త మీనన్ సినిమాలు అనౌన్స్ చేయడంలేదు. సంయక్త సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటో అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. అయితే వరుస విజయాలను అందుకున్న సంయుక్త తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్త పడుతుందని అందుకే గ్యాప్ తీసుకుంటుంటుందని అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు..
అయితే తాజాగా ఓ క్రేజీ ఆఫర్ ను అందుకుంది.. కార్తికేయ ఫెమ్ హీరో నిఖిల్ సరసన నటిస్తుందట సంయుక్త. నిఖిల్ చేస్తున్న పిరియాడికల్ డ్రామా చేస్తున్న విషయం తెలిసిందే. సంయుక్త మీనన్ తెలుగుతో పాటు తమిళ్ సినిమాలలోనూ అవకాశాలు అందుకుంటుంది.. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంబు సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. స్వయంభూ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఈ సినిమా పీరియాడిక్ సినిమా అని తెలుస్తుంది.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..