పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న సినిమా బ్రో ది అవతార్…ఈ సినిమా పై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి…ఇక ఇది మల్టీ స్టారర్ సినిమా గా తెరకెక్కుతుంది.పవన్ కు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.సాయితేజ్ సన్నివేశాలకు సంబంధించి కొంత ప్యాచ్ వర్క్ అయితే మిగిలి ఉందని సమాచారం .మరోవైపు తాజాగా చిత్ర యూనిట్ బ్రో మూవీ రషెస్ చూసి ఎంతగానో హ్యాపీగా ఫీలైనట్లు సమాచారం.సినిమా అవుట్ పుట్ కూడా అద్భుతం గా రావడం తో చిత్ర యూనిట్ ఆనందం గా ఉంది.పవన్, సాయితేజ్ నటిస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్రో మూవీ వినోదాయ సిత్తం రీమేక్ గా అయితే తెరకెక్కింది. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం విశేషం.ఈ సినిమా కు రోజుకు 2 కోట్ల రూపాయల చొప్పున పవన్ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.త్వరలో పవన్, సాయితేజ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొననున్నారని తెలుస్తుంది.
విరూపాక్ష వంటి భారీ హిట్ తరువాత సాయితేజ్ నటించిన సినిమా కావడం ఈ సినిమా కు ఒకింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.. 2024 ఎన్నికల కు ముందే ఎక్కువ సినిమాలు విడుదలయ్యే లా చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. బ్రో సినిమా సక్సెస్ సాధిస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. బ్రో మూవీ కమర్షియల్ గా కచ్చితం గా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.సముద్రఖని బ్రో సినిమా కు దర్శకుడు అనే విషయం తెలిసిందే..అయితే ఈ సినిమా గురించి డైరెక్టర్ సముద్రఖని మాట్లాడుతూ ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఒక గుర్తుండి పోయే సినిమా గా నిలుస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు..భారీ కమర్షియల్ హిట్ ను సొంతం చేసుకుంటుందని కూడా ఆయన తెలిపారు.