శాంసంగ్ A-సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను ఈ రోజు ఇండియాలో లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ 16 5జీ (Samsung Galaxy A16 5G)తో గత వారం యూరప్‌లో ప్రారంభమైంది. తాజాగా.. ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ Super AMOLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
శాంసంగ్ నుంచి గెలాక్సీ A16 5Gని ఆవిష్కరించింది. మొదటి ఫోన్‌తో పోలిస్తే ఈ ఫోన్ చాలా అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. కొత్త గెలాక్సీ A16 5G 6.7-అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు, 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వస్తుంది. కంపెనీ 6 సంవత్సరాల OS అప్‌డేట్‌లను అందిస్తోంది.