Samsung Galaxy F36: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ తన తాజా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Galaxy F36 5G ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మెరుగైన ప్రాసెసర్, ప్రీమియం డిస్ప్లే, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ మిడ్‌రేంజ్ గెలాక్సీ F36 5Gలో లభించే ఫీచర్లను చూసేద్దామా..
డిస్ప్లే అండ్ డిజైన్:
శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ 120Hz Super AMOLED Infinity-U డిస్ప్లే ఉంది. ముందు భాగానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ రక్షణ, వెనుక భాగానికి వేగన్ లెదర్ ఫినిష్ ఉండటం ప్రత్యేక ఆకర్షణ. ఫోన్ మందం కేవలం 7.7mm మాత్రమే కాగా, బరువు 197 గ్రాములు మాత్రమే.
ప్రాసెసర్:
ఈ ఫోన్ Exynos 1380 5nm ఆక్టా కోర్ ప్రాసెసర్ పై పనిచేస్తోంది. ఇందులో 6GB లేదా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్టోరేజీని 2TB వరకు మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 15, One UI 7 పై పనిచేస్తోంది. ఇందులో ముఖ్యంగా 6 ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ హామీ ఇచ్చింది శాంసంగ్.
Shah Rukh Khan : ‘కింగ్’ మూవీ కి బ్రేక్.. షూటింగ్‌లో షారుఖ్‌కు గాయాలు..?
కెమెరా ఫీచర్లు:
ఈ శాంసంగ్ గెలాక్సీ F36 5G ఫోన్‌లో 50MP ప్రాధమిక కెమెరా (OIS తో), 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా, 4K వీడియో రికార్డింగ్, 13MP ఫ్రంట్ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ అండ్ కనెక్టివిటీ:
ఈ కొత్త ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది (ఛార్జర్ బాక్స్‌లో ఉండదు). ఈ విషయం ఈ ఫోన్ అమ్మకాలపై ప్రభావం చూపనుంది. ఇక కనెక్టివిటీలో 5G SA/NSA, 4G VoLTE, Wi-Fi 5, Bluetooth 5.3, GPS, USB Type-C ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ద్వారా సెక్యూరిటీ అందించబడుతోంది.
Ahmedabad Plane Crash: అంతర్జాతీయ మీడియాకు పైలట్ల సంఘం లీగల్ నోటీసు.. ఏముందంటే..!
ధర:
Samsung Galaxy F36 5G 6GB + 128GB వేరియంట్ రూ. 17,499 కాగా, 8GB + 128GB వేరియంట్ ను రూ.18,999 ధరలో అందుబాటులో ఉంటుంది. ఇక లాంచ్ ఆఫర్లతో ప్రారంభ ధర రూ.15,999 మాత్రమే. లాంచ్ ఆఫర్ల కింద అన్ని బ్యాంకు కార్డులపై రూ.1000 ఇన్స్టంట్ రాయితీ అందిస్తున్నారు. అంతేకాకుండా రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ జూలై 29 నుండి ఫ్లిప్ కార్ట్, శాంసంగ్ ఇండియా ఆన్లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానుంది. మంచి డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, OIS కెమెరా, లాంగ్ టెర్మ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో గెలాక్సీ F36 5G మిడ్‌రేంజ్ మార్కెట్లో అమ్మకాల పరంగా దూసుకెళ్లే అవకాశముంది.