Maharastra : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) కంటోన్మెంట్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. షాపులో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. అస్లాం టైలర్ అనే దుకాణంలో మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య మంటలు చెలరేగాయి. బ్యాటరీ ఉన్న రిక్షా చార్జింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు. అక్కడ పేలుడు జరగడంతో షాపులో భారీగా మంటలు చెలరేగాయి. బట్టల దుకాణం కావడంతో మంటలు ఎక్కడికక్కడ వ్యాపించడంతో ఇద్దరు మృతి చెందారు. అలాగే అగ్నిప్రమాదంతో ఊపిరాడక ఐదుగురు చనిపోయారు. ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
Read also:Maganti Babu: ముఖ పరిచయం లేని వ్యక్తిని.. చరిత్ర కలిగిన ఏలూరులో ఎలా నిలబెడతారు?: మాగంటి బాబు
మృతుల్లో అసిమ్ వసీం షేక్, పారీ వాసిం షేక్, 30 ఏళ్ల వసీం షేక్, 23 ఏళ్ల మహిళ తన్వీర్ వాసీమ్, 50 ఏళ్ల హమీదా బేగం, 35 ఏళ్ల షేక్ సోహైల్, 22 ఏళ్ల రేష్మా షేక్ పేర్లు వెల్లడయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందిస్తూ, ఛత్రపతి శంభాజీనగర్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Read also:Hundi Robbery: గుడిలో దొంగతనం చేస్తుండగా హుండీలో ఇరుక్కున్న దొంగ చెయ్యి.. చివరకి..?!
రెండో అంతస్తుకు చేరుకునేలోపే మంటలు ఆరిపోయాయి. ఔరంగాబాద్ పోలీస్ కమీషనర్ మనోజ్ లోహియా మాట్లాడుతూ ప్రాథమిక విచారణలో ఇద్దరు కాలిన గాయాలతో మరణించారని, మిగిలిన ఐదుగురు ఊపిరాడక మరణించారని తేలింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు.