టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది. తెలుగు సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నా, ఇప్పుడు మళ్లీ తన కెరీర్‌లో కొత్త దారులు వెతుక్కుంటూ, సినిమాలు – ప్రొడక్షన్ – ఫిట్నెస్ ఇలా అన్ని వైపులా దూసుకెళుతోంది. అయితే తాజాగా “ఆ విషయంలో నాదే తప్పు” అంటూ సమంత చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Rashmika: స్త్రీలు బలహీనులు కాదు.. వారు ఏకమైతే ఆ శక్తిని ఎవరూ ఆపలేరు: రష్మిక
మయోసైటిస్ నుంచి పూర్తిగా రికవర్ అయిన తర్వాత సమంత మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతుంది. తన సొంత బ్యానర్ ‘Tralala Moving Pictures’ ద్వారా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తూ నిర్మిస్తోంది. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అదేకాక, సమంత త్వరలో ‘రక్త బ్రహ్మాండ’ వెబ్ సిరీస్‌తో కూడా రానుంది. ‘ఫ్యామిలీ మాన్ 3’ సీరీస్ అమెజాన్ ప్రైమ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, దాని గురించి కూడా ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. ఇక తాజాగా..
సమంత తన ఫిట్‌నెస్ జర్నీపై ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.. “బీస్ట్ మోడ్ ఫుల్ యాక్షన్ మోడ్” అంటూ షేర్ చేసిన ఆమె, గతంలో వెన్నెముక బలహీనత విషయంలో తానే నిర్లక్ష్యం వహించానని ఒప్పుకుంది. కానీ ఇప్పుడు క్రమశిక్షణ, కఠినమైన వర్కౌట్స్ వల్ల తన శరీరం ఎంత మారిందో చూపిస్తూ – అది పూర్తిగా నా తప్పు అని ఇప్పుడు అర్థమైందని చెప్పింది. “ఫలితం కనిపించని రోజుల్లో కూడా వర్కౌట్‌కు రావడం సులభం కాదు. కొన్నిసార్లు వదిలేయాలని పించినా ఆగకుండా చేస్తేనే అసలు మార్పు వస్తుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వయస్సు పెరిగే కొద్దీ చాలా అవసరం. ఇది నాకు ఓర్పు, క్రమశిక్షణ నేర్పింది. ‘జీన్స్ కారణం’ అనేది సాకు మాత్రమే” అని సమంత తన నోట్‌లో పేర్కొంది.