టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సామజవరాగమన. ఈ సినిమా రీసెంట్ గా విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన రెబా మోనికా హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా ను యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు తెరకెక్కించారు.ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.అలాగే ఈ సినిమాను హాస్య మూవీస్ పతాకంపై నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణ లో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా నిలిచిన సామజవరగమన సినిమా థియేటర్స్ లో అద్భుతమై న రెస్పాన్స్ ను సాధించింది.ఈ సినిమా దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ లో విడుదలయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులు ఆహా ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది.ఈ సినిమాను ఆహా సంస్థ వారు జులై 28 న స్ట్రీమింగ్ చేయాలనీ అనుకున్నారు. కానీ ప్రేక్షకుల కోరిక మేరకు ఒక రోజు ముందుగానే జూలై 27 రాత్రి 7 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఆహా టీం ప్రకటించింది.దీనితో ఈ సినిమా అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీ లో విడుదల అయింది.థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ సాధించిన ఈ సినిమా ఓటీటీ లో కూడా అంతే రెస్పాన్స్ సాధిస్తోంది.ఈ సినిమా ఓటీటీ లో విడుదల అయిన కేవలం 40 గంటల్లో నే ఏకంగా 100 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసి ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చేసింది..ఈ సినిమా లో హీరో శ్రీ విష్ణు తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అలాగే సీనియర్ హీరో నరేష్ కామెడీ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది.త్వరలోనే ఈ సినిమాను బుల్లితెర పై కూడా ప్రసారం చేయబోతున్నట్లు సమాచారం..