బాలివుడ్ బాద్షా కండల వీరుడు సల్మాన్ ఖాన్, తెలుగు స్టార్ హీరో వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. కోలీవుడ్‌లో వచ్చిన ‘వీరమ్’, టాలీవుడ్‌లో వచ్చిన ‘కాటమ రాయుడు’ చిత్రాలకు రీమేక్ సినిమాగా ఈ సినిమాను తెరాకెక్కించారు..ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. వెంకటేశ్, భూమిక, జగపతిబాబు లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. ఆశించిన మేరకు ఆకట్టుకోలేకపోయింది.. అనుకున్న హిట్ ను అందుకోలేక పోయింది..
అయితే సినిమా హిట్ టాక్ ను అందుకోలేక పోయిన కూడా జనాల్లో మంచి క్రేజ్ ను అందుకుంది..ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను జీ 5 పెద్ద మొత్తానికి దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది. జూన్ 23 నుంచి ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.. అయితే థియేటర్లలో పెద్దగా ఆడని సినిమా ఓటీటీ లో భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ సినిమా కూడా అలాగే హిట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఇక్కడ ఈ సినిమా హిట్ అయితే మాత్రం మంచి కలెక్షన్స్ ను అందుకుంటుంది..
ఇకపోతే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘టైగర్ 3’ సినిమాలో నటిస్తున్నాడు. టైగర్ సిరీస్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకముందు వచ్చిన ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా’ సినిమాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులను చేసుకుంటుంది.. అన్నీ కార్యక్రమాలను అనుకున్న సమయంలో పూర్తి చేసుకొని దీపావళి కానుకగా విడుదల చెయ్యనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.. ఇక వెంకీ కూడా సినిమాతో పాటుగా వెబ్ సిరీస్ లను కూడా చేస్తున్నాడు..