రెబల్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రేజీ డైరెక్టర్ ప్రశాంతి నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలలో తెరకెక్కింది. మొదటగా సలార్ పార్ట్ వన్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇకపోతే తాజాగా మరోసారి సలార్ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. దీనికి కారణం సలార్ సినిమా ఆదివారం సాయంత్రం 5:30 నిమిషాలకు ‘స్టార్ మా’ చానల్లో ప్రచారం కాబోతుంది. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ ఈ సినిమాపై బజ్ నెలకొంది.
Also read: Volunteer: ఎన్నికల నేపథ్యంలో ‘వాలంటీర్’ టైటిల్‌తో సినిమా..
ఈ సినిమాకి సంబంధించి టీవీ ప్రీమియర్ కోసం ఏకంగా ప్రభాస్ మాటలతో ఓ ప్రోమోని తాజాగా తీసుకువచ్చింది స్టార్ మా. సలార్ సినిమా వరల్డ్ టీవీ ప్రీమియర్ ను మిస్ అవ్వొద్దు అంటూ స్టార్ మా చానల్లో చూడండి అంటూ హీరో ప్రభాస్ తెలిపారు. దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాను చూసిన వారికి సలార్ సినిమాలో హీరో ప్రభాస్ వాడిన బైక్ ను అందించబోతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
Also read: Vishal: పీఎం గారు మమ్మల్ని పట్టించుకోండి.. విశాల్ సంచలన కామెంట్స్..
ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా పార్ట్ 2 కూడా రాబోతోంది. 2025 లో సలార్ పార్ట్ 2 శౌర్యాంగపర్వం విడుదల అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటిటి ప్లాట్ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక హీరో ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 ఏడి విడుదల కావలసి ఉంది. మొదటగా ఈ సినిమా మే 9న అనుకున్న కాకపోతే కొన్నిఅకాల కారణాలవల్ల ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యింది.
🎬 Brace yourself for an exhilarating cinematic adventure! Mark your calendars for the action-packed blockbuster 'Salaar' starriing #Prabhas, @PrithviOfficial and @shrutihaasan . Don't miss it tomorrow at 5:30 PM, exclusively on #StarMaa! 🍿✨ #Salaar #StarMaa pic.twitter.com/2VM6k3B4MZ
— Starmaa (@StarMaa) April 20, 2024