Prabhas Salaar Movie Trailer Release Date Announced: పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘సలార్’. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న సలార్ పార్ట్-1.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పండగను పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఓ క్రేజీ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
సలార్ ట్రైలర్ రిలీజ్ టైమ్‌ను చిత్ర యూనిట్ నేడు ప్రకటించింది. డిసెంబర్ 1న రాత్రి 7.19 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు హోంబలే ఫిలిమ్స్ తన ఎక్స్‌లో పేర్కొంది. అంతేకాదు ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ అయింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఓ వాహనంపై నిల్చొచి.. గన్ ఫైర్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభాస్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Also Read: Plane-Car Accident: రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్!
సలార్ మొదటి పార్ట్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఓ ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా సలార్‌లో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై హోంబలే ఫిలిమ్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
𝐆𝐞𝐚𝐫 𝐮𝐩 𝐟𝐨𝐫 𝐚𝐧 𝐞𝐱𝐩𝐥𝐨𝐬𝐢𝐯𝐞 𝐜𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 💥#SalaarCeaseFire Trailer is set to detonate on Dec 1st at 7:19 PM 🔥
Happy Deepavali Everyone 🪔 #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai… pic.twitter.com/rf0wwNvWX5
— Hombale Films (@hombalefilms) November 12, 2023